JSP: జగనన్న కాలనీ పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారు.! కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్థసారథి పై జనసైనికులు ఫైర్ అయ్యారు. జగనన్న కాలనీ పేరుతో ఎమ్మెల్యే వేల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ పతనం ఖాయమన్నారు. By Jyoshna Sappogula 17 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Janasena: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి పై జనసైనికులు ఫైర్ అయ్యారు. జగనన్న కాలనీ పేరుతో ఎమ్మెల్యే వేల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం వస్తుందని అప్పుడు వైసీపీ దోచుకున్నదంతా కక్కిస్తాం అంటూ థీమ వ్యక్తం చేశారు. Also Read: మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి సీఎం హెచ్చరిక ఈ సందర్భంగానే పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు జనసైనికులు. భవిష్యత్ గ్యారెంటి కార్యక్రమంతో ఇంటింటికి తిరుగుతూ ఓటర్ వెరిఫికేషన్ చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా దొంగ ఓట్లను వెలకితిస్తామని అన్నారు. అలాగే ఈ నెల 19న జరిగే రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం పార్టీతో జనసైనికులు కలిసి నిరసన కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. టీడీపీ జనసేన కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునించారు. Also Read: కాకరకాయ తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా..? అయితే జాగ్రత్త ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు జనసైనికులు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానే లేదని.. మళ్లీ వైసీపీ వస్తే రాష్ట్రానికి బ్రతుకే ఉండదని అన్నారు. దేశ సైనికులు ఏవిధంగా పాకిస్తాన్ పై పొరాడుతారో అలాగే టీడీపీ జనసైనికులు కలిసి కట్టుగా పొరాడి వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు. వైసీపీ గంజాయి బ్యాచ్ ఎన్ని బెదిరింపులకు దిగిన జనసైనికులు భయపడేదేలేదని అన్నారు. వైసీపీ నాయకులు దొంగ ఓట్లు చేస్తున్నందుకేనా జగన్ వై నాట్ 175 అంటున్నారని అన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ పతనం ఖాయమని వ్యాఖ్యనించారు. వైసీపీ నాయకులు ఇకనైన అవినీతి రాజకీయాన్ని మానుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాక వైసిపి వారు దాకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. #jana-sena-tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి