/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pothina-jpg.webp)
Pothina Mahesh: విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు కోసం జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తన కార్యకర్తలతో కలిసి శాంతియుత నిరాహార దీక్ష చేస్తూ పోరాడుతున్నారు. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి కేటాయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో దీక్ష చేపట్టారు పోతిన మహేష్. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు జనసేనకే కేటాయించాలని నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
Also Read: అయో ‘రామా’.. ఎంత మోసం జరిగిపోయిందన్న😢!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ సీటు తనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. స్థానికుడినైన తనకు ప్రజల మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. తనకు సీటు కేటాయించకపోతే వైసీపీ గెలుస్తుందని కామెంట్స్ చేశారు. పొత్తు ఉద్దేశం కూడా నెరవేరదని వాపోయారు.
Also Read: నేటి నుంచే కార్తీకదీపం-2.. నెట్టింట్లో జోరుగా మీమ్స్..ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకేనా?
RTVతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. పశ్చిమలో మొదటి నుండి వైసీపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడింది జనసేననేనన్నారు. జనసేన పోరాటం వల్లే వెల్లంపల్లి సీటు మారిందని పేర్కొన్నారు. వైసీపీని ఓడించాలనే పొత్తులు పెట్టుకున్నా పొత్తు ధర్మం ఫలించాలంటే తనకు సీటు ఇవ్వాల్సిందేనన్నారు. వేరే వారికి సీటు ఇస్తే వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. పశ్చిమ ఓటర్లు కూడా తనకే మద్దతు ఇస్తారని వెల్లడించారు. సీటు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పవన్ కళ్యాణ్ ఫొటోతో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటలేదు కాబట్టే శాంతియుతంగా దీక్ష చేస్తున్నానని వివరించారు.