Kiran Royal : పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.. పోతిన మహేష్‌కు కిరణ్ రాయల్ కౌంటర్..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి పోతిన మహేష్‌కు లేదని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. జగన్‌ను చూసి పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలో పోతిన మహేష్ చెప్పాలన్నారు. బాబాయిని ఎలా చంపాలో, తల్లి చెల్లిని ఎలా గెంటెయ్యాలో నేర్చుకోవాలని మహేష్ చెబుతున్నాడా? అని ప్రశ్నించారు.

Kiran Royal : పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.. పోతిన మహేష్‌కు కిరణ్ రాయల్ కౌంటర్..!
New Update

Kiran Royal Counter To Pothina Mahesh :  వైసీపీ (YCP), జనసేన (Janasena) నేతల డైలాగ్ వార్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత పోతిన మహేశ్‌ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) జగన్‌ను చూసి నేర్చుకోవాలని మహేశ్ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు తిరుపతి జనసేన జనసేన నేత కిరణ్‌ రాయల్ కౌంటర్‌ ఇచ్చారు.

జగన్ ను చూసి పవన్ కళ్యాణ్ ఏం నేర్చుకోవాలో పోతిన మహేష్ చెప్పాలన్నారు. బాబాయ్‌ని బాత్రూమ్‌లో ఎలా చంపాలో నేర్చుకోవాలా? అమ్మా, చెల్లిని ఎలా గెంటేయాలో నేర్చుకోవాలా? ఎస్సీ, బీసీ నాయకుల్ని ఎలా కొట్టి చంపాలో నేర్చుకోవాలా? అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి పోతిన మహేష్‌ది కాదని ఎద్దేవా చేశారు. ప్రజలపై ప్రేమతో జగన్ బటన్ నొక్కారని అన్నారు.. కానీ ఆ ప్రజలకు జగన్ పై ప్రేమ లేదు కాబట్టే 11 స్థానాలకు పరిమితం చేశారన్నారు.  175 స్థానాల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ నేతలు.. డబుల్ సెంచరీ అంటూ భ్రమల్లో బతుకుతున్నారని సెటైర్లు వేశారు.

Also Read : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!



#ys-jagan #pothina-mahesh #janasena-kiran-royal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe