పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి.. టికెట్ వార్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి మరోసారి నిలపడాలని భావిస్తున్న ముత్తిరెడ్డికి పల్లా రాజేశ్వర్రెడ్డి నుంచి గట్టి పోటి నెలకొంది. జనగామ క్యాడర అంతా ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే మంత్రి హరీశ్‌రావుకు కంప్లైంట్ ఇచ్చారు. అటు జనగామ నుంచి పోటి చేయాలని పల్లా అభ్యర్థిగా భావిస్తున్నారు. పల్లాకు కేసీఆర్ సపోర్ట్ కూడా ఉంది. ఇదే సమయంలో ప్రగతిభవన్ నుంచి ముత్తిరెడ్డికి పిలుపు రావడం ఆసక్తిని కలిగిస్తోంది. By Trinath 16 Aug 2023 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి జనగామ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపువచ్చింది. హుటాహుటిన ప్రగతి భవన్‌కి చేరుకున్నారు ముత్తిరెడ్డి. జనగామ టికెట్‌పై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈసారి టికెట్ దక్కుతుందా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ముత్తిరెడ్డి చుట్టూ పలు వివాదాలు ఉండడమే దీనికి కారణం. ముత్తిరెడ్డిపై సొంత కూతురే తీవ్ర ఆరోపణలు చేసింది. జనగామ టికెట్‌పై ఆసక్తిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. అటు జనగామ టికెట్ రేసులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మరోవైపు జనగామ బీఆర్ఎస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ముత్తిరెడ్డి, పల్లా అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవకు సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. జనగామ టిక్కెట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే అని అనుచరుల ప్రచారం చేస్తుండగా.. BRS నర్మెట్ట సర్పంచ్‌ల ఫోరం ఈ ప్రచారాన్ని అడ్డుకుంది. పల్లా అనుచరుల్ని నిలదీసింది సర్పంచ్‌ల ఫోరం. ముత్తిరెడ్డికి కాకుంటే టిక్కెట్ ఎవరికిచ్చానా ఓకేనని.. పల్లా మాత్రం వద్దని తేల్చి చెబుతున్నారు నేతలు. ప్రగతి భవన్ ప్రతిష్టను పల్లా దిగజార్చుతున్నారని ఫైర్ అయ్యారు. టికెట్ డౌటే? ముత్తిరెడ్డి టికెట్ ఆశలపై నీళ్లు చల్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం జనగామ నియోజకవర్గాలన్నీ మంత్రి హరీశ్ రావు కనుసన్నల్లో నడుస్తున్నాయి. అక్కడి క్యాడర్ తో హరీశ్ రావు భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే ఏమవుతుంది అన్నదానిపై చర్చించారు. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో రియల్ గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ గురించి చర్చించిన తర్వాత ఓ క్లారిటీకి వచ్చారు. మీటింగ్‌కి వచ్చిన వాళ్లలో 99 శాతం మంది ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ విషయం ముత్తిరెడ్డికి ఇప్పటికే తెలిసిపోయింది. నేరుగా ప్రగతి భవన్ నుంచే ఆయనకు సమాచారం అందింది. నేతలు అంతా తమ దగ్గరికి మీపై కంప్లైంట్ చేయడానికి వచ్చారని ప్రగతిభవన్ ముత్తిరెడ్డికి చెప్పినట్టు సమాచారం. ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే పని చేయమని తేల్చి చెప్పారట నేతలు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ టికెట్ ఆశిస్తున్నారు. ఓవైపు కేసీఆర్ అండదండలు కూడా పల్లాకి ఉన్నాయి. హరీశ్ రావే దగ్గరుండి ఈ తతంగం అంతా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చిన సూచనలతోనే ఇదంతా జరుగుతోందని టాక్. జనగామలో ప్రయోగం చేయాలంటే ముత్తిరెడ్డిని పక్కన పెట్టాల్సిందేనని బీఆర్‌ఎస్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.రెండుసార్లు ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జా విషయాల్లోనూ ముత్తిరెడ్డి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకే ఈసారి తనకు టికెట్ రాదన్న విషయం ముత్తిరెడ్డికి కూడా తెలుసు. కానీ చివరి ప్రయత్నంగా కేసీఆర్‌ని కలిసి తనను నిలబెడితే కచ్చితంగా గెలుస్తానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. #muthireddy #janagoan-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి