AP: జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?

జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎక్కడ..? అంటూ నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి దూరంగా ఉంటున్న సుధీర్ రెడ్డి.. రేపు జరగబోయే జగన్ మీటింగ్ కు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
AP:  జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?

EX MLA Dr. Sudheer Reddy: కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎక్కడ..? అంటూ నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా నేతలకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే అందుబాటులో లేరని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి దూరంగా ఉంటున్న సుధీర్ రెడ్డి.. రేపు జరగబోయే జగన్ మీటింగ్ కు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: వైసీపీ కోసం పని.. ప్రభుత్వం నుంచి జీతాలు.. వెలుగులోకి భారీ కుంభకోణం?

25వ తేదీ నుంచి పులివెందుల కేంద్రంగా జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశాలకు సైతం దూరమయ్యే యోచనలో ఉన్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు దూరం కావడంతో తమ పరిస్థితి ఏంటని స్థానిక నాయకత్వం సందేహం వ్యక్తం చేస్తోంది.

Also Read: విమానంలో ఆగిపోయిన ఏసీ.. ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు

మాజీ ఎమ్మెల్యే తీరుతో సెకండ్ క్లాస్ లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు.  సుధీర్ రెడ్డి తన వాహనాలను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన దేశాన్ని దాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.

Advertisment
తాజా కథనాలు