AP: ఆ చెత్త అధికారి వల్లే జగన్ ఓటమి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే నైజం చంద్రబాబుది కాదన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారన్నారు. తాను చేసిన తప్పేంటో.. తనన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదని కామెంట్స్ చేశారు.

New Update
AP: ఆ చెత్త అధికారి వల్లే జగన్ ఓటమి.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Jakkampudi Raja: రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ,ఈ రకమైన ఓటమిని చవి చూస్తామని అనుకోలేదన్నారు. తాను చేసిన తప్పేంటో..తనను ఎందుకు ఓడించారో తెలియడం లేదన్నారు. రాజకీయాల్లో చూడాల్సింది ఇంకా చాలా ఉందని అనిపిస్తోందన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే నైజం చంద్రబాబుది కాదని విమర్శలు గుప్పించారు.

చర్చకు సిద్ధం..

రాజకీయాలలో విలువలు పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని..లక్షల కోట్లు ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. ఏ రోజు తన భార్యతో గాని తన పిల్లలతో గాని పది నిమిషాలు కూర్చున్న పరిస్థితి లేదని..తమ నియోజకవర్గంలోని గ్రామాలలో అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని ఉద్ఘాటించారు. గతంలో కంటే తన హయాంలో 20, 30 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. తాను నడవలేని స్థితిలో ఉన్నా .. ప్రతి గడపగడపకు కాలినడకన తిరిగానన్నారు. ప్రజల తీర్పును మనస్పూర్తిగా తీసుకోలేకపోతున్నానన్నారు.

Also Read: అవినాష్‌ను గెలిపించిన షర్మిల.. ఎలా అంటే..?

చెత్త అధికారి..

ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ధనంజయ రెడ్డి ఎమ్మెల్యేలను రేపు .. ఎల్లుండి అంటూ ఐదు సంవత్సరాల తరబడి తిప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డి విశ్వాసంతో నమ్మారని..‌ ప్రజలకు సేవ చేయడం కోసం ధనుంజయ రెడ్డి కాళ్ల చుట్టూ తిరిగేవాళ్లమన్నారు.

ఆస్తులు అమ్మినా..

సచివాలయంలో అధికారులు సరిగా స్పందించేవారు కాదని.. జగన్మోహన్ రెడ్డి ఓడినా .. గెలిచిన ఆయన రియల్ హీరో అని కామెంట్స్ చేశారు. ఆయన చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగిలినా మా నడవడిక మారదన్నారు. లక్షల రూపాయలు విలువ చేసే భూములను పేదలకు ఉచితంగా ఇచ్చాను అది నా తప్పా అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం తాను చేసిన అప్పులను తీర్చడానికి తన ఆస్తులు మొత్తం అమ్మినా సరిపోవన్నారు. తన ఆఖరి శ్వాస వరకు రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే నడుస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు