Jabardast Comedian Arrested:ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్!!

జబర్దరస్త్ కమెడియన్ సింగర్ సందీప్ ను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని లైంగికంగా లోబర్చుకోవడంతో పాటు ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

New Update
Jabardast Comedian Arrested:ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్!!

Jabardasth Comedian Arrested: జబర్దరస్త్ కమెడియన్ సింగర్ సందీప్ (Sandeep) ను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని లైంగికంగా లోబర్చుకోవడంతో పాటు ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

ఇక వివరాల్లోకి వెళితే..జబర్దస్త్ కామెడీ షో ద్వారా సింగర్ సందీప్ ఫేమస్ అయ్యాడు. అయితే 2018 లో వాట్సాప్ చాటింగ్ ద్వారా అతనికి ఓ యువతి పరిచయమైంది. అది కాస్తా వారి మధ్య ప్రేమగా మారింది. ఇక ఈ విషయంలో యువతి ఇంట్లో తెలియడంతో సందీప్ యువతిని హైదరాబాద్ లో ఓ హాస్టల్ లో పెట్టాడు. అలా వారిద్దరు దగ్గరయ్యారు. అయితే ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొని వచ్చినా.. సందీప్ దాటేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు సందీప్ ఆమెను కాదని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.

దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి పోలీసులను ఆశ్రయించి అతడి పై ఫిర్యాదు చేసింది. లైంగికంగా తనను లోబపర్చుకొని ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్దమైనట్టు అందులో పేర్కొంది. అయితే ఆమె కంప్లైంట్ పై విచారణ జరిపిన మధురానగర్ పోలీసులు సందీప్ ను ఈ రోజు అరెస్ట్ చేశారు.

Also Read: చంద్రయాన్-3 ఫొటో తీసిన చంద్రయాన్-2…వాట్ ఏ మిరాకిల్ బ్రో..!!

Advertisment
తాజా కథనాలు