itel Buds Ace ANC: చౌకైన ఇయర్‌బడ్స్ .. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు..

itel భారతదేశంలో బడ్స్ ఏస్ ANC పేరుతో కొత్త ఇయర్‌బడ్స్ ను విడుదల చేసింది. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. ఈ బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

New Update
itel Buds Ace ANC: చౌకైన ఇయర్‌బడ్స్ .. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు..

itel Buds Ace ANC: itel భారతదేశంలో బడ్స్ ఏస్ ANC(itel Buds Ace ANC) పేరుతో కొత్త ఇయర్‌బడ్‌లను విడుదల చేసింది. ఈ బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఇయర్‌బడ్స్‌లో 10mm డ్రైవర్లు ఉన్నాయి. ఇవి డ్యూయల్ టోన్ డిజైన్‌లో లభిస్తాయి. వాటి ధర, అన్ని స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో itel బడ్స్ ఏస్ ANC ధర
itel Buds Ace ANC భారతదేశంలో రూ. 1399 ( ద్వారా )కి లభిస్తుంది. ఇవి క్రాన్‌బెర్రీ జ్యూస్, వైట్, మిడ్‌నైట్ బ్లూ కలర్ వేరియంట్‌లలో వస్తాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో మాత్రమే కాకుండా, దేశంలోని ప్రధాన రిటైలర్ స్టోర్‌ల నుండి ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయవచ్చు.

itel బడ్స్ ఏస్ ANC స్పెసిఫికేషన్స్
itel బడ్స్ Ace ANC ఇయర్‌బడ్‌లు 10mm డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఇయర్‌బడ్‌లు డ్యూయల్ టోన్ డిజైన్‌లో లభిస్తాయి. కంపెనీ ప్రకారం, ఇది రిచ్ సౌండ్‌తో మంచి బేస్ ను అందించగలదు, ఇది వినియోగదారుకు మెరుగైన సంగీత అనుభవాన్ని ఇస్తుంది. ఇది AI అలాగే ENC అంటే ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతు ఇచ్చే డ్యూయల్ మైక్‌ను కలిగి ఉంది. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ని కలిగి ఉంటాయి. ANCకి 50dB వరకు సపోర్ట్ చేస్తుంది.

ఇయర్ బడ్స్‌లో టచ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఇది 50 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. అంతే కాకుండా వీటిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. వీటిలో, 60ms వరకు తక్కువ-లేటెన్సీ మోడ్ ఉంటుంది.

Also Read: వయనాడ్‌ లో గల్లంతైన ఆ 600 మంది కార్మికులు ఎక్కడ..?

ఇవి IPX5 రేటింగ్‌తో వస్తాయి. దీని వల్ల నీటిలో తడిచిన త్వరగా చెడిపోకుండా ఉంటాయి. కనెక్టివిటీ కోసం, బ్లూటూత్ v5.3కి సుప్పొయేట్ చేస్తుంది. అంతేకాకుండా, AI వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. ఇయర్‌బడ్స్‌లోని ప్రతి బడ్ 40mAh బ్యాటరీతో వస్తుంది, అయితే కేస్ యొక్క బ్యాటరీ సామర్థ్యం 500mAh. ఇది 10 నిమిషాల ఛార్జ్‌లో 180 నిమిషాల ప్లేబ్యాక్ సమయాన్ని ఇవ్వగలదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు