MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు

ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఐటీ అధికారులతో కలిసి సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి 10 మంది ఈడీ అధికారుల బృందం ఆమె నివాసం తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు
New Update

ED Raids On MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఐటీ శాఖ అధికారులతో కలిసి సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి 10 మంది ఈడీ అధికారుల బృందం ఆమె నివాసంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్‌ నేతృత్వంలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కవిత తో పాటు ఆమె భర్త వ్యాపార లావాదేవీలపై అరా తీస్తున్నట్లు సమాచారం. ఈ  క్రమంలో కవిత ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెను ఛార్జిషీట్ లో నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ సమన్లు పంపిన విషయం తెలిసిందే.

ALSO READ: నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా ఆర్‌ఎస్ ప్రవీణ్ పోటీ

సీబీఐ దూకుడు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్ లో సీబీఐ (CBI) చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు (Notices) పంపిన విషయం తెలిసిందే. 2022లో ఎమ్మెల్సీ కవిత ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టింది. ఇదే కేసులో కవితను ఇప్పటి వరకు మూడు సార్లు ప్రశ్నించింది ఈడీ (ED). ఇటీవల ఈ కేసులో విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు పంపడంతో ఆమె సుప్రీం కోర్టు ఆశ్రయించింది. ఈడీ నోటీసులను కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

పిటిషన్లు వాయిదా..

లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు పంపగా.. సమన్లు సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఆమె వేసిన పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19న విచారణ జరపనున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.

#mlc-kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe