Abhishek Agarwal: 'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాతకు షాక్..! టెన్షన్ లో రవితేజ..! 'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసంలో ఐటి సోదాలు నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు . By Archana 11 Oct 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Abhishek Agarwal: రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వర్ రావు' (Tiger Nageswara Rao) నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Producer Abhishek Agarwal) నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించారు. ఇటీవలే టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ కు ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా చాలా త్రిల్లింగ్ గా, భారీ అంచనాలతో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను నిర్మాతలు పాన్ ఇండియా స్థాయిలో రీలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 'టైగర్ నాగేశ్వర్ రావు' నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నివాసంలో ఐటి సోదాలు నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు . కాశ్మీర్ ఫైల్స్ సీక్వెల్, ది ఢిల్లీ ఫైల్స్ సినిమాను నిర్మించారు అభిషేక్ అగర్వాల్. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన 'టైగర్ నాగేశ్వరరావు' త్వరలో విడుదల కానుంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ గతంలో 'కిర్రాక్ పార్టీ', గూడాచారి1, గూడాచారి 2, కాజల్ అగర్వాల్ నటించిన సీత ఇలా పలు సినిమాలను నిర్మించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత మాత్రమే కాదు వ్యాపార వేత్త కూడా ఈయన అభిషేక్ గ్రూప్ సంస్థ MD. 'A1 Express' సినిమాతో ఆయన నిర్మాత గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్నారు. తాజాగా 'టైగర్ నాగేశ్వర్ రావు' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రవితేజ (Ravi Teja) రియాలిటీ షో బిగ్ బాస్ లో కనిపించారు. డైరెక్టర్ వంశీ ఈ సినిమాను తెరక్కెక్కించగా అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 'స్టువర్టుపురానికి' (Stuartpuram) చెందిన పేరు మోసిన గజ దొంగ 'గోకరి నాగేశ్వరరావు' జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'టైగర్ నాగేశ్వర్ రావు' సినిమా విడుదలకు సిద్దమవుతున్న ఈ సమయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ నివాసంలో ఐటీ సోదాలు (IT raids) సినిమాపై ఏమైనా ప్రభావం చూపుతాయా అనే టెన్షన్ లో ఉన్నారు మూవీ బృందం. హీరో రవితేజ కూడా సినిమా విడుదల సజావుగా సాగుతుందో లేదో అని టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం. భారీ అంచనాలతో తీసిన ఈ సినిమా విడుదల సమయంలో ఇలా జరగడం చిత్ర బృందాన్ని టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తుంది. Also Read: Amitabh Bachchan: బిగ్ బీ అందుకే చెప్పులు లేకుండా వస్తారా..? #it-raids-on-abhishek-agarwal #tiger-nageshwar-rao-producer #abhishek-agarwal #tiger-nageswara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి