Israel vs Palestine: 3వేలు దాటిన మృతుల సంఖ్య.. హమాస్‌ని ISISతో పోల్చిన ఇజ్రాయెల్‌..!

ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. హమాస్‌ తీవ్రవాదుల దాడులను ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహు ఐసీస్‌(ISIS) ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మరోవైపు తమ దేశంపై ఆకస్మిక దాడి చేసిన హమాస్‌ మిలిటెంట్లను...ఇజ్రాయెల్‌ సైన్యం వెతికి మరీ చంపుతోంది. ఇక గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

Israel vs Palestine: 3వేలు దాటిన మృతుల సంఖ్య.. హమాస్‌ని ISISతో పోల్చిన ఇజ్రాయెల్‌..!
New Update

ఇజ్రాయెల్‌(Israel)-పాలస్తీనా(palestine) మధ్య జరుగుతున్న పోరులో మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గాజా సరిహద్దు ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇక హమాస్‌ తీవ్రవాదుల దాడులను ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహు ఐసీస్‌(ISIS) ఉగ్రవాద సంస్థతో పోల్చారు. మరోవైపు తమ దేశంపై ఆకస్మిక దాడి చేసిన హమాస్‌ మిలిటెంట్లను...ఇజ్రాయెల్‌ సైన్యం వెతికి మరీ చంపుతోంది. హమాస్‌ మిలిటెంట్‌ స్థావరాలున్న గాజా స్ట్రిప్‌(Gaza strip)పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐతే ఇజ్రాయెల్‌కు ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. అదేంటంటే హమాస్‌ మిలిటెంట్ల దగ్గర ఇజ్రాయెల్‌ ప్రజలు బందీలుగా ఉండడమే. గాజా స్ట్రిప్‌పై ఎలాంటి హెచ్చరిక లేకుండా ఇజ్రాయెల్‌ వేసే ఒక్కొ బాంబుకు ప్రతిగా..తమ దగ్గర బందీలుగా ఉన్న ఒక్కొ వ్యక్తిని ఉరితీస్తామని వార్నింగ్ ఇచ్చింది హమాస్‌. ప్రస్తుతం హమాస్‌ మిలిటెంట్ల దగ్గర 150 మందికిపైగా బందీలుగా ఉన్నట్లు సమాచారం. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. శనివారం ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులు చేసిన వెంటనే సరిహద్దు పట్టణాల్లోకి చొరబడ్డ హమాస్‌ మిలిటెంట్లు అక్కడ స్థానికుల్ని బందీలుగా పట్టుకున్నారు. ఐతే నలుగురు బందీలు మరణించినట్లు తెలుస్తోంది. వారు ఇజ్రాయెల్‌కు చెందిన వారా లేదా ఇతర దేశీయుల అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఖతార్‌ మధ్యవర్తిత్వం:
హమాస్‌ దాడులకు ప్రతిదాడి చేస్తామని..ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించలేరంటూ ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్‌కు హమాస్‌ మిలిటెంట్ల చేతిలోని బందీలు ఓ ప్రధాన సమస్యగా మారారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ మూడు లక్షల మంది సైనికులను బరిలో దించింది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ ప్రజలు ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్షం సైతం పూర్తి మద్దతును ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం చేయబోమన్నారు మాజీ ప్రధాని లాపిడ్‌. ఐతే బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకురాలేకపోతే నెతన్యాహును ఇజ్రాయెలీలు క్షమించరని పలువురు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్‌ తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ విషయంలో ఖతార్‌ మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలంటే ఇజ్రాయెల్‌ జైళ్లలో మగ్గుతున్న 36 మంది పాలస్తీనియన్ మహిళలు, పిల్లలు విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. చర్చలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఎలాంటి చర్చలు జరపడం లేదని ఖతార్‌లోని హమాస్‌ నేతలు చెప్తున్నారు.

అటు హమాస్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ అధినేత నెతన్యాహు..గాజా స్ట్రిప్‌ను పూర్తి దిగ్బంధించారు. కరెంటు, నీరు, ఫుడ్ సరఫరా నిలిపివేశారు. మద్యదరా సముద్ర తీరంలో గాజా స్ట్రిప్‌ 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ 23 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఎప్పటికీ లాక్‌డౌన్‌ పరిస్థితలు ఉండే అతికొద్ది ప్రదేశాలలో గాజా ఒకటి. ఇక ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన మూడో ప్రదేశం గాజా స్ట్రిప్‌.

ALSO READ: 40 మంది చిన్నపిల్లల తలలను నరికేశారు… ఇది యుద్ధం కాదు మారణహోమం…!

#israel-vs-palestine
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe