PMJAY: బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ కు శుభవార్త వస్తుందా?

 ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించారు. దీని ద్వారా దేశంలోని 12 కోట్లకు పైగా పేద ప్రజలకు 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కల్పిస్తుంది. గత బడ్జెట్ లో దీనికి 12% నిధులు పెంచారు. ఈ ఏడాదికూడా పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

New Update
PMJAY: బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ కు శుభవార్త వస్తుందా?

PMJAY: ఆరోగ్యమే మహా భాగ్యం.. ఈ దిశలో దేశంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం అందించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ముందు దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడం ద్వారా 1,50,000 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లను (HWCs) ఏర్పాటు చేస్తున్నట్లు ఫిబ్రవరి 2018న తెలిపింది ప్రభుత్వం. తరువాత దీనిని మరింత విస్తృతం చేయడం కోసం ప్రధాని మోడీ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన( PM-JAY) పథకాన్ని సెప్టెంబర్ 23, 2018న ప్రారంభించారు. PM-JAY ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అని చెప్పవచ్చు. ఇది మన దేశంలో 12 కోట్లకు పైగా ఉన్న పేద-బలహీన కుటుంబాలకు ఆరోగ్య ధీమా అందించే కార్యక్రమం. దీని ద్వారా ఈ ప్రజలకు కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తారు. 

ఈ పథకానికి అయ్యే ఖర్చులు కేంద్రం, రాష్ట్రాలు (ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మినహా) 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి. ఈశాన్య రాష్ట్రాలు,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ విషయంలో ఇది 90:10 గా ఉంటుంది. 

Also Read: Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలను ఆకర్షించే పథకాలు!

ఇక ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కోసం 2023 కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు 12% పెంచారు. 2022-23 సంవత్సరంలో ఇది 6 వేల కోట్లు కాగా ఇది 23-24 సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలకు చేరింది. జనవరి 4, 2023 నాటికి PM-JAY కింద 21.9 కోట్ల మంది లబ్ధిదారులు వేలిడేట్ అయ్యారు.  ఈ పథకం 26,055 ఆసుపత్రుల ద్వారా మొత్తం ₹50,409 కోట్లతో దాదాపు 4.3 కోట్ల మంది ఆసుపత్రిలో చేరడానికి అవకాశం కల్పించింది. 

ఇప్పుడు బడ్జెట్ 2024లో భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కోసం మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరికొద్దిగంటల్లో బడ్జెట్ ప్రతిపాదనలు వెలువడనున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం. అందుకే, ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ అని చెప్పుకుంటున్న ఈ పథకానికి ఏదైనా ప్రత్యేక నిధులు ప్రకటిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. 

Watch this interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు