Air Pods : మీ ఎయిర్ పాడ్స్ లో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తుందా?

మీరు యాపిల్​ ఎయిర్​పాడ్స్​ను వాడుతున్నారా? కానీ వాటిలో ఒకటి పనిచేయడం లేదా? అయితే ఈ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. మరి ఆ కారణాలు ఏంటి? ఎయిర్​పాడ్స్​ను మళ్లీ ఎలా రీసెట్​ చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Air Pods : మీ ఎయిర్ పాడ్స్ లో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తుందా?

Air Pods Pro Problem : ముందుగా మీ ఎయిర్​పాడ్స్(Air Pods) ​లో తగినంత ఛార్జింగ్​ ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మీ ఎయిర్‌పాడ్స్​ కేస్​ను ఓపెన్​ చేసి మీ ఫోన్‌కు దగ్గరగా పెట్టండి. వెంటనే ఛార్జ్ స్టేటస్​ అనేది ఫోన్​లో కనిపిస్తుంది. లేదా మీ ఫోన్ సెట్టింగ్స్​లోకి వెళ్లి మీ ఫోన్ ఎయిర్​పాడ్స్​ నేమ్​పై క్లిక్ చేయండి. వెంటనే సదరు ఎయిర్​పాడ్స్​లో ఎంత ఛార్జింగ్​ ఉందో చూపిస్తుంది.

తరువాత మీ బ్లూటూత్​ సెట్టింగ్స్​(Bluetooth Settings) ను ఓపెన్ చేసి, ఎయిర్​పాడ్స్​కు కనెక్ట్ అయి ఉన్నాయో లేదో చూసుకోండి. లేదంటే వాటిని ఆన్​​ చేయండి. ఆ తర్వాత మీ రెండు ఎయిర్​పాడ్స్​ మీ ఫోన్​కు కనెక్ట్​ అయ్యాయో లేదో చూడండి. అప్పటికీ ఒక ఎయిర్​పాడ్​ పనిచేయకపోతే, దానిలో ఏదైనా దుమ్ము, ధూళి ఉన్నాయోమో చెక్​ చేయండి. ఒక శుభ్రమైన కాటన్​ వస్త్రంతో దానిని క్లీన్​ చేయండి. అలాగే ఎయిర్‌పాడ్స్​ కేస్​ లోపల కూడా ఇయర్​బడ్(Ear Bud) ​తో శుభ్రంగా క్లీన్​ చేయండి. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టి మళ్లీ పెయిర్​ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే అప్పటిదాకా వినపడని ఎయిర్​పాడ్​ తిరిగి పనిచేసే అవకాశం ఉంటుంది.

ఒక వేళ ఇన్ని చేసినా మీ ఎయిర్​పాడ్​ పనిచేయకపోతే, మీ ఫోన్​ను ఆఫ్​ చేసి మళ్లీ ఆన్​ చేయండి. అలా ఆన్​ చేసిన తర్వాత, మళ్లీ మీ ఎయిర్​పాడ్స్​ను ఫోన్​తో కనెక్ట్​ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే కూడా మీ ఎయిర్​పాడ్​ పనిచేసే అవకాశం ఉంది. అయితే మీ ఫోన్​ను ఆఫ్​ చేసే ముందు సెట్టింగ్స్​లోకి వెళ్లి ఎయిర్​పాడ్స్​ సెట్టింగ్స్​లోని 'Disconnect' ఆప్షన్​పై క్లిక్​​ చేయడం మరిచిపోకండి.

పైన తెలిపిన విధంగా అన్నీ చేసినా, ఇంకా మీ ఎయిర్​పాడ్​ పనిచేయకపోతే, చివరగా ఈ టిప్​ ట్రై చేయండి. మీ ఎయిర్​పాడ్స్​ను రీసెట్​ చేయండి. ఇందుకోసం ముందుగా మీ ఫోన్​ లేదా టాబ్లెట్​లోని సెట్టింగ్స్​లోకి వెళ్లండి. అక్కడ మీకు మీ ఎయిర్​పాడ్స్​ పేరు కనిపిస్తుంది. ఇదే మెనూను స్క్రోల్​ డౌన్ చేస్తే, చివరన మీకు 'Forget This Device' అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయండి. ఇప్పుడు మీ డివైజ్​కు ఎయిర్​పాడ్స్​ను కనెక్ట్​ చేయాలనుకుంటున్నారా? అని అడుగుతుంది. అప్పుడు మీ ఎయిర్​పాడ్స్​ను మళ్లీ రీకనెక్ట్​ చేసుకోవచ్చు. ఆన్-స్క్రీన్​ ప్రాంప్ట్‌లను అనుసరిస్తూ ఎయిర్​పాడ్స్​ కనెక్ట్​ అయినట్లు చూపించే వరకు లేదా కనెక్ట్​ అయ్యేంతవరకు మీ ఎయిర్​పాడ్స్​ కేస్​ వెనుక భాగంలో పెయిర్​ చేసే బటన్‌ను నొక్కి పట్టుకోండి.

Also Read : ఏప్రిల్‌ ఫస్ట్‌ ఫూల్స్‌ డే మాత్రమే కాదు..ఆ రోజు జరిగిన ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుంటే షాకే!

Advertisment
Advertisment
తాజా కథనాలు