Andhra Pradesh: లగడపాటి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? రసవత్తరంగా మారిన వీరి భేటీ..

మరి ఇప్పుడు ఆయన తన మనసును మార్చుకుని మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారా? వాగ్దానం పక్కనపెట్టి, అభిమానుల కోరిక మేరకు మళ్లీ పొలిటికల్ కండువా కప్పుకుంటారా? ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరుతారు? ఒకవేళ ఆయన పోటీ చేయదల్చుకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? గతంలో విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తారా?

New Update
Andhra Pradesh: లగడపాటి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? రసవత్తరంగా మారిన వీరి భేటీ..

Lagadapati Rajagopal Reddy Political Re Entry: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఒకప్పటి కాంగ్రెస్(Congress) నేత మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్ అవ్వాలని చూస్తున్నారా? ఇందుకు సంబంధించి బ్యాంక్‌గ్రౌండ్‌లో చర్చలు నడుస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అవును, రాజకీయ సన్యాసానికి స్వస్తి పలికి.. పోలిటికల్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు లగడపాటి రాజగోపాల్ సమాయత్తమవుతున్నట్లు టాక్ వస్తోంది. ఈ రోజు కొంతమంది లగడపాటి(Lagadapati Rajagopal) ముఖ్య అనుచరులు నగరంలోని ఓ ప్రముఖ హాటల్‌లో రహాస్యంగా సమావేశమయ్యారు. విజయవాడ(Vijayawada) రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న లగడపాటి రాజగోపాల్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పోలిటికల్‌గా స్పీడ్ పెంచితే అధికార, ప్రతిపక్షాల ఆటలకు చెక్ పడినట్లే అని రాజకీయ పరిశీలకులు

అయితే, లగడపాటితో సమావేశమైన ఆయన ముఖ్య అనుచరగనం.. పార్లమెంటరీ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో పర్యటించి క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపాలనే కసరత్తు చేస్తునట్లు తెలుస్తోంది. గడచిన పదేళ్లుగా లగడపాటి రాజగోపాల్ కోసం ఎదురు చూస్తున్న క్యాడర్‌కు ఇదోక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ లగడపాటి రాజగోపాల్ ను మళ్లీ రాజకీయరంగంలోకి దింపాలనే యోచనలో అనుచరులంతా భావిస్తునట్లు సమాచారం. రానున్న ఎన్నికలలో మళ్లీ లగడపాటిని ఎంపీగా పార్లమెంట్‌లో చూడాలని వారంతా గట్టిగానే పట్టు పట్టినట్లు విశ్వసనీయ సమాచారం. లగడపాటి రాజగోపాల్ రాకతో విజయవాడ రాజకీయ స్వరూపమే మారిపోతుందని అంతా భావిస్తున్నారు.

వాస్తవానికి 2014లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు విడిపోకముందు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండేవారు లగడపాటి రాజగోపాల్ రెడ్డి. విజయవాడ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన.. నాడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు.. అడ్డుకునేందుకు ఏకంగా పప్పెర్ స్ప్రే నే ప్రయోగించి దేశ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది సెంటర్‌గా నిలిచారు. ఎంత పోరాడినా.. కేంద్రం వెనక్కి తగ్గకపోవడం, రాష్ట్ర విభజన జరిగిపోవడం అయ్యింది. ఈ విషయంలో ఆగ్రహంతోనే.. ఏపీకి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందంటూ ఆ పార్టీని వీడారు. అంతేకాదు.. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టనంటూ, రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటించేశారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 10 ఏళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, రాజకీయంగా దూరంగా ఉన్నప్పటకీ.. రాజకీయాలకు మాత్రం దూరం లేరు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో ఎన్నికలపై సర్వేలు నిర్వహిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సర్వేలతో ఆంధ్రా అక్టోపస్‌గా కూడా గుర్తింపు పొందారు. కొన్నిసార్లు ఆయన చేసిన సర్వేలు సక్సెస్ అవ్వగా.. మరికొన్ని సర్వేలు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. ముఖ్యంగా 2018 ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టీ ఫ్లాష్ టీమ్ చేపట్టిన సర్వే అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ సర్వే రిపోర్ట్స్‌పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఎన్నికల తరువాత లగడపాటి మరింత సైలెంట్ అయ్యారు. మధ్య మధ్యలో ఆయన పొలికల్ రీ ఎంట్రీపై ప్రచారం జరిగినా.. వాటిని ఖండిస్తూ వచ్చారు లగడపాటి.

కానీ, ఇప్పుడు మాత్రం మ్యాటర్ సీరియస్‌గానే కనిపిస్తోంది. అనుచరులంతా పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలంటూ ఆయనపై ఒత్తిడి చేస్తున్నారట. ఆయన కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరి లగడపాటి రాజగోపాల్ రెడ్డి నిజంగానే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? ఇస్తే విజయవాడ నుంచే ఎంపీగా పోటీ చేస్తారా? ఇక తాను పోటీ చేయబోనని, చేసిన వాగ్దానం మేరకు రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానంటూ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, మీటింగ్స్‌లో ఖరాకండిగా చెప్పారు లగడపాటి. మరి ఇప్పుడు ఆయన తన మనసును మార్చుకుని మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారా? వాగ్దానం పక్కనపెట్టి, అభిమానుల కోరిక మేరకు మళ్లీ పొలిటికల్ కండువా కప్పుకుంటారా? ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరుతారు? ఒకవేళ ఆయన పోటీ చేయదల్చుకుంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? గతంలో విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తారా? లేక వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? ఈ ఒక్క మీటింగ్‌తో ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ వీటన్నింటికి సమాధానం తెలియాలంటే.. లగడపాటి నోటి నుంచి ఓ ప్రకటన రావాల్సిందే.

Also Read: తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్‌దే గెలుపు.. పీకే కీలక వ్యాఖ్యలు

#lagadapati-rajagopal-reddy #lagadapati-rajagopal-reddy-political-re-entry #lagadapati-rajagopal-re-entry-in-politics #lagadapati-rajagopal-re-entry
Advertisment
Advertisment
తాజా కథనాలు