Diabetic Health: ఈ మధ్య కాలం చాలా మందిలో జీవన శైలి వ్యాధులు మధుమేహం, ఊబకాయం, రక్త పోటు సహజంగా కనిపిస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలు ఈ సమస్యల పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. జీవన శైలి వ్యాధుల్లో వయసు తో సంబంధం లేకుండా ఎక్కువ కనిపించే సమస్య మధుమేహం. ఈ సమస్య ఉన్నవారు .. వాళ్ళు తినే ఆహరం పై చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా తియ్యని ఆహారాలు తినడానికి మరింత ఆలోచిస్తారు. వాటిలో ఒకటి ఖర్జూర. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దీనిలో స్వీట్ నెస్ ఎక్కువగా ఉంటుంది అందుకే సందేహపడతారు. అసలు ఖర్జూర తినొచ్చా లేదా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి
ఖర్జూరలోని పోషకాలు
ఖర్జూర స్వీట్ గా ఉన్నప్పటికీ.. వీటిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలోని సెలూనియం, క్యాల్షియం, కాపర్, సోడియం, విటమిన్ A, ఐరన్ పొటాషియం, మెగ్నీషియం ఆరోగ్యంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ తినే ఆహారంలో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
మధుమేహం ఉన్నవారు తినొచ్చా
అయితే మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాలో 43-55 శాతం ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కర స్థాయిలు పెరగనివ్వదు. అలా అని అతిగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. రోజుకు 1 లేదా 2 సర్వింగ్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే వీటిలోని అధిక ఫైబర్ కూడా ఈ సమస్య ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. కానీ ఇలాంటి వ్యాధులు ఉన్నవారు రోజు ఆహారంలో ఏదైనా చేర్చేటప్పుడు వైద్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: chocolate Banana Cake: వావ్ చాక్లెట్ బనాన కేక్ ఇంత ఈజీనా..! పూర్తి రెసిపీ చూసేయండి