GST on Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గుతుందా? తేలేది అప్పుడే!

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. జీఎస్టీ కౌన్సిల్ రేపు అంటే సెప్టెంబర్ 9న జరిపే సమావేశంలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కోరుతున్నారు. 

GST on Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గుతుందా? తేలేది అప్పుడే!
New Update

GST on Health Insurance:  హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ అంశం చాలా కాలంగా చర్చల్లో ఉంది. దీనిపై ఒక స్పష్టత రావడానికి ఒక్కరోజు సమయం ఉంది.  జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం అంటే సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సమావేశం తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందా లేదా అన్నది తేలనుంది. ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తే లేదా తొలగించినట్లయితే, దేశంలోని కోట్లాది మందికి ఆరోగ్య బీమా అందుబాటులోకి వస్తుంది. అయితే, మరోవైపు ఇది ప్రభుత్వ ఆదాయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ కౌన్సిల్ ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కౌన్సిల్‌కు ఆప్షన్లు ఇచ్చిన ఫిట్‌మెంట్ కమిటీ.. 

GST on Health Insurance:  జీఎస్టీ కౌన్సిల్‌లోనే ఫిట్‌మెంట్ కమిటీ ఉంది. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ రేట్ల మార్పుపై చాలా కాలంగా ఈ కమిటీలో చర్చ జరుగుతోంది. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ అధికారులు కూడా పాల్గొంటారు. తుది నిర్ణయం కౌన్సిల్ చేతిలో ఉన్నప్పటికీ, కమిటీ జిఎస్‌టి కౌన్సిల్‌కు అనేక సూచనలను అందించింది. ప్రస్తుతం పాలసీదారులు హెల్త్ ఇన్సూరెన్స్  ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. యితే దీనిపై జీఎస్టీని రద్దు చేయాలని లేదా ఈ రేటును 5%కి తగ్గించాలని ప్రభుత్వం నుండి డిమాండ్ ఉంది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా.. 

GST on Health Insurance:  వైద్య బీమా ప్రీమియంను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నెల రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించారు. మరోవైపు రాష్ట్రాల నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి.  కర్నాటక ప్రభుత్వం తక్కువ - మధ్య ఆదాయ గ్రూపు పాలసీదారులకు ఆరోగ్య బీమాపై 18% GST అమలును పునఃపరిశీలించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జీఎస్టీని ఎత్తివేసి సామాన్యులకు ఉపశమనం కలిగించాలని కౌన్సిల్‌ను అభ్యర్థించారు.

బీమా హోల్డర్లకు ప్రయోజనాలు అందించాలి .. 

GST on Health Insurance:  నిజానికి ప్రభుత్వం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పై జీఎస్టీ తగ్గించాలని భావిస్తోంది. అయితే, ఏదైతే జీఎస్టీ భారాన్ని తగ్గిస్తారో అది ప్రజలకు చేరుతుందా? లేదా అనేది అనుమానమే అని భావిస్తున్నారు. జీఎస్టీ ప్రభుత్వం తగ్గించినా.. కంపెనీలు తమ లాభం పెంచుకోవడానికి దాని ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకపోవచ్చనే భయం కౌన్సిల్ కు ఉంది. అందుకే, దీని విషయంలో పాలసీ హోల్డర్స్ కు లాభం చేకూర్చే విధానం పై కసరత్తులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో వినియోగదారులపై భారం తగ్గించడంతోపాటు లాభాలు కంపెనీల జేబుల్లోకి వెళ్లకుండా చూసే ఫార్ములా ఇవ్వడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నారు.

#gst #health-insurance
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe