Invitation To Janasena Pawan Kalyan: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఆర్.ఎస్.ఎస్. ముళ్లపూడి జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు తెలిపారు. ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ శ్రీ పూర్ణ ప్రజ్ఞ పాల్గొన్నారు.
జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనేతలతో సహా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపించింది. శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ వేడుకలకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా ఆహ్వానించింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 12.45 గంటల మధ్య గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ట్రస్ట్ నిర్ణయించింది. వేద పూజారి లక్ష్మీకాంత దీక్షిత్ ఆ రోజున ముడుపుల ప్రధాన క్రతువులను నిర్వహించనున్నారు.
Also Read: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవుల ప్రకటన.. డేట్స్ ఇవే!
అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహాన్ని ఆరు నెలల్లోనే తయారు చేశారు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj). ఇక ఎంపిక చేసిన విగ్రహంతో పాటు తయారు చేయించిన మిగిలిన రెండు విగ్రహాలను కూడా అయోధ్య ఆలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొననున్నారు.