Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. పిన్నెల్లిపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఏం ధ్వంసం చేసిన వీడియోను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రదర్శించారు. దీనిపై మీ సమాధానం ఏంటని పిన్నెల్లి తరపున న్యాయవాదులను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై ఆగ్రహం చేసింది.
Also Read: ఏపీ-తెలంగాణలో అనూహ్యమైన మార్పులు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి తదుపరి విచారణలో అన్ని అంశాలను దృష్టి పెట్టుకుని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని హెచ్చరించింది. తర్వాతి విచారణలో పూర్తి స్థాయి విచారణ చేస్తామని తెలిపింది. పిన్నెల్లి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు పిటిషన్ వేశారు. బెయిల్ రద్దు పిటిషన్‌తోపాటు మరో రెండు పిటిషన్లు వేశారు. నంబూరి పిటిషన్లపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం విచారణ జరిపింది.