/rtv/media/media_files/2025/08/17/kseniya-alexandrova-2025-08-17-20-06-36.jpg)
Kseniya Alexandrova
Kseniya Alexandrova: రష్యాకు చెందిన ప్రముఖ మోడల్, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ అయిన క్సేనియా అలెక్సాండ్రోవా కారు ప్రమాదంలో మృతి చెందారు. అయితే జులై 5న రష్యాలోని ట్వెర్ ఒబ్లాస్ట్ ప్రాంతంలో క్సేనియా ఆమె భర్త కలిసి వెళ్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో క్సేనియా తలకు తీవ్రమైన గాయాలవడంతో కోమాలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్సేనియా ఆగస్టు 12న మృతి చెందింది. అయితే పెళ్ళైన నాలుగు నెలల వ్యవధిలోనే ఆమె ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
కార్ యాక్సిడెంట్
అయితే వారు కారులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద జింక రోడ్డుపైకి రావడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్సేనియా భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్సేనియా మృతి పట్ల ఆమె మోడలింగ్ ఏజెన్సీ, మిస్ యూనివర్స్ సంస్థతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రష్యా మోడల్
ఇదిలా ఉంటే క్సేనియారష్యాలో ఒక ప్రసిద్ధ మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో జరిగిన మిస్ రష్యా పోటీలో ఆమె మొదటి రన్నరప్‌గా విజయం సాధించారు. మోడలింగ్ తో పాటు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన క్సేనియా అలెక్సాండ్రోవా సైకాలజిస్ట్ గా కూడా పనిచేశారు.