International Panic Day 2024: ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అంతర్జాతీయ భయాందోళన (Panic) దినోత్సవం 2024 జరుపుకుంటున్నారు. శరీరం పై భయాందోళన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 18న ఈ ప్రత్యేక రోజును జరుపుకుంటారు. పానిక్ అటాక్ అనేది అనేక ఇతర తీవ్రమైన సమస్యలను కలిగించే ఒక మానసిక పరిస్థితి. అధ్యయనం ప్రకారం, నగరాల్లో నివసించే 30 శాతం మంది ప్రజలు తమ జీవితంలో ఒక్కసారైనా భయాందోళనలకు గురవుతారు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు, కాళ్ళు వణుకుతున్నట్లుగా అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు.
ఆందోళన , భయాందోళనల మధ్య తేడా
ప్రజలు ఆందోళన, తీవ్ర భయాందోళనలను ఒకే విషయంగా భావిస్తారు. అయితే, ఆందోళన, భయాందోళనలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఈ రెండు సమస్యల మధ్య చాలా తేడా ఉంది. ఆందోళన అనేది ఒక రకమైన మానసిక రుగ్మత, భయాందోళన భయం, టెన్షన్ కారణంగా అకస్మాత్తుగా తలెత్తుతుంది. ఈ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. పానిక్ అటాక్‌లు ఎక్కడైనా, ఎప్పుడైనా రావచ్చు. అందుకే నేడు అంతర్జాతీయ భయాందోళన(Panic) దినోత్సవం సందర్భంగా పానిక్ అటాక్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాము
భయాందోళనలను నివారించే చర్యలు
భయాందోళనకు గురైనప్పుడు పుల్లనివి తినండి
భయాందోళనలకు గురైనప్పుడు ఒత్తిడి లేకుండా ఉండటానికి, పుల్లని పదార్థాలను తినవచ్చు. దీని ద్వారా ద్రుష్టి పుల్లని రుచి వైపు ఆకర్షించడం ప్రారంభమవుతుంది. తద్వారా భయాందోళన కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.
వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం (Exercise) చేయడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది. రోజువారీ వ్యాయామం ఆందోళన కలిగించే సంభావ్యతను తగ్గిస్తుంది. ఆందోళన, భయాందోళనల నుంచి దూరంగా ఉండటానికి, వారానికి కనీసం 5 రోజులు 45 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి.
ప్రకృతితో సమయం గడపడం
నేటి కాలంలో, ఎక్కువ సమయం సోషల్ మీడియా , స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు చాలా మంది. ఇది ఒత్తిడిని సృష్టించడానికి ప్రధాన కారణం. అటువంటి పరిస్థితిలో, ప్రకృతితో కొంత సమయం గడపడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భయాందోళనను తగ్గిస్తుంది. ఇంట్లోని బాల్కనీలో మొక్కలను పెంచడం, వాకింగ్ చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ ను తగ్గించుకోవచ్చు.
ధ్యానం
క్రమం తప్పకుండా ధ్యానం (Meditation) చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఇది మీ జీవితంపై దృష్టి పెట్టడంలో కూడా సహాయపడుతుంది. నిజానికి రోజంతా పనిలో నిమగ్నమై ఉండడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా అలసిపోయి శక్తి నశించిపోతుంది. అటువంటి పరిస్థితిలో, మనస్సుకు శక్తిని ఇవ్వడానికి ధ్యానం చాలా ముఖ్యం.
గట్టిగా ఊపిరి తీసుకోవడం
అకస్మాత్తుగా భయాందోళనకు గురైనప్పుడు లేదా మైకము అనిపించినప్పుడు.. లోతైన శ్వాస తీసుకోవడం ప్రారంభించండి. దీని ద్వారా ఒత్తిడి, టెన్షన్ తగ్గే అవకాశం ఉంటుంది.