International Day of Happiness: సంతోషమే సగం బలం.. ఇలా చేస్తే మీ లైఫంతా ఫుల్ హ్యాపీ!

ఒక మనిషి జీవితమంతా సంతోషంగా బ్రతకగలడా? దీనికి జవాబు చెప్పడం కష్టం. కానీ, సంతోషంగా గడపడం కోసం ప్రయత్నం చేయడం పెద్ద కష్టం కాదు. కాస్త ప్రయత్నం అవసరం అంతే. “ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్” అందుకే దీని కథేమిటో తెలుసుకోవడానికి సంతోషంగా టైటిల్ పై క్లిక్ చేసేయండి. 

New Update
International Day of Happiness: సంతోషమే సగం బలం.. ఇలా చేస్తే మీ లైఫంతా ఫుల్ హ్యాపీ!

International Day of Happiness: దేవుడే దిగివచ్చినా..  స్వర్గమే నాకిచ్చినా..  షాజహన్ తిరిగొచ్చినా..  తాజ్ మహల్ రాసిచ్చినా..  ఇప్పడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా..  లోలోన మనసంతా సంతోషమే..  ఈప్రేమ పులకింత సంతోషమే.. అంటూ నాగార్జున సంతోషం సినిమాలో పాడేస్తూ ఉంటే.. మన మనసూ సంతోషంతో నిండిపోయింది. ఆ సినిమాలో నాగార్జునకు ప్రేమ సంతోషాన్నిచ్చింది. కొంతమందికి కుటుంబంతో ఇంటిలో గడపడం సంతోషాన్నిస్తుంది.. యువతలో ఎక్కువ మందికి ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడిపేస్తే సంతోషంగా ఉంటుంది. చిన్న పాపకి కొద్దిసేపటి నుంచి కనిపించని తల్లి ఎదురు పడగానే పట్టలేని సంతోషంతో కేరింతలు కొడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే సంతోషానికి కారణాలు మనిషి మనిషికీ మారిపోతూ ఉంటాయి. కానీ, అందరూ జీవితమంతా సంతోషంగా ఉండడం సాధ్యమేనా. జీవితమంతానా.. అదేం మాట కనీసం ఒక్క గంట సంతోషంగా ఉండమనండి చూద్దాం. కదా. సంతోషం అనే పదాన్ని తలుచుకుంటేనే అదోరకమైన కిక్ వస్తుంది. సంతోషమే సగం బలం అని పెద్దలు చెప్పేది అందుకే. సంతోషంగా ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉన్నామని అనుకోండి చాలు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ఎవరో చెప్పగా విన్నాను. అదీ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. నిజంగా.. నిజాయితీగా చెప్పాలంటే.. సంతోషంగా ఉండడం అంటే ఏమిటి అనేది కూడా మనకెవరికీ తెలీదు. తాత్కాలికంగా మనసుకు దొరికే ఆహ్లాదాన్నే సంతోషం అని అనుకుంటూ సంతోషంగా జీవించేస్తున్నాం మనం.. 

ఏమిటిది.. సంతోషం తప్ప ఇంకో మాట లేకుండా ఇంత సోది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఈరోజు అంటే మార్చి 20వ తేదీ ప్రపంచ సంతోష దినోత్సవం అదేనండీ వరల్డ్ హ్యాపీనెస్ డే. అందుకని సంతోషం అంటే ఏమిటి అనే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తే.. ముందు సంతోషం సినిమా గుర్తొచ్చింది. తరువాత ఆ పాట గుర్తొచ్చింది. అదీ విషయం. సరే ఇప్పుడు సంతోషం కోసం ఒకరోజు అన్నారు కదా ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. (సంతోషానికి రోజేంటీరా బాబూ అని కూడా అనిపించవచ్చు) దీనిని ఐక్యరాజ్యసమితి తీసుకువచ్చింది. ఈ రోజును జరుపుకోవడం 2013లో అంటే 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 

2011లో, ఐక్యరాజ్యసమితి సలహాదారు జేమ్స్ ఇలియన్ హ్యాపీనెస్ డేని జరుపుకోవాలని ప్రతిపాదించారు. మరుసటి సంవత్సరం 2012 లో, దీనికి సంబంధించి UN లో ఒక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదన చేశారు. అలా ప్రతి ఏటా ఈ హ్యాపీనెస్ డే ని ఐక్యరాజ్యసమితి మాత్రం హ్యాపీగా నిర్వహిస్తూ వస్తోంది. ప్రజలు ఆనందం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈరోజు ఉపయోగపడుతుందని, పడాలని ఐక్యరాజ్యసమితి తపన. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి ఈ రోజున తన హ్యాపీనెస్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. హ్యాపీనెస్ డే ద్వారా, ప్రజల మానసిక ఆరోగ్యం - సంతోషంగా ఉండటంపై దృష్టి పెడతారు. నిజానికి ఈ ఇండెక్స్ ద్వారా ఏ దేశంలో ఎంత మంది సంతోషంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదీ ఈ హ్యాపీనెస్ స్టోరీ. 

Also Read: ఆన్‌లైన్ బ్యాంకింగ్ లో చూస్తూ..చూస్తూనే మోసపోతాం.. ఇలా!

International Day of Happiness: ఈ సందర్భంగా మనం కూడా మనవంతుగా మనం సంతోషంగా ఉంటూ.. పక్క వారిని సంతోషంగా ఉంచాలని ప్రయత్నిద్దాం. కొంచెం కష్టమే.. కానీ ప్రయత్నిస్తే పోయేదేం లేదుగా. ఎందుకంటే, చిరునవ్వుతో ఎదుటివారిని పలకరిస్తే.. వారి నుంచి వచ్చే రెస్పాన్స్ తో మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అంతేకాదు.. నవ్వడానికి డబ్బేమీ ఖర్చు కాదు కదా. నిజానికి డబ్బు ఖర్చు అయ్యేది ఏదైనా మన సంతోషాన్ని పాడు చేస్తుంది. అందుకే డబ్బు ఖర్చు కాకుండా మన మనసుతోనే తెచ్చుకోగలిగే సంతోషాన్ని మనం మన మనస్సులో నింపుకుని.. తోటివారికి అందిద్దాం. 

సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి అని పెద్దలను అడిగితే వారు చెప్పేది ఏమిటంటే.. “జీవితంలో ఆనందంగా ఉండాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కోరికలు తగ్గించుకోండి” అని. అవును కదా.. కోరికలు తగ్గించుకుంటే మంచిదే. ఎదో కోరుకోవడం.. అది దక్కలేదని బాధ పడటం.. ఇదంతా ఎందుకు చెప్పండి.. కోరికలు తగ్గిచుకుందాం.. సంతోషంగా గడిపేద్దాం. అందరికీ హ్యాపీనెస్ డే  శుభాకాంక్షలు!

Advertisment
తాజా కథనాలు