AP: వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్.. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు, కేడర్ పాలకొల్లు వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్ నడుస్తోంది. నేతలు, కేడర్ రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత ఇన్‌ఛార్జి గోపాలరావును తప్పించాలని.. మేక శేషుబాబు, గుణ్ణం నాగబాబుల వర్గం డిమాండ్ చేస్తోంది. గోపాలరావురావు ఉంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. By Jyoshna Sappogula 04 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి West Godavari: ఏపీలో వైసీపీ ఘోర ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తరువాత నుంచి ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల వైసీపీ కార్యాలయాలు కూల్చివేశారు. అటు నేతలు, కేడర్ లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీలో లోకల్, నాన్‌లోకల్ వార్ నడుస్తోంది. నేతలు, కేడర్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఓటమి తర్వాత విభేదాలు మరింత ముదిరాయి. Also Read: బాలికపై మాజీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు..! వేర్వేరుగా సమావేశాలు పెట్టిన నేతలు లోకల్ నేతకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ఇన్‌ఛార్జి గోపాలరావును తప్పించాలని..మేక శేషుబాబు, గుణ్ణం నాగబాబుల వర్గం డిమాండ్ చేస్తోంది. గోపాలరావు వల్లే పార్టీ నాశనమైందనే వాదన వినిపిస్తోంది. గోపాలరావురావు ఉంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని తేల్చిచెప్పారు. సీనియర్ నేత యడ్ల తాతాజీ మాత్రం ఎవరికి బాధ్యతలు అప్పగించినా పని చేస్తానంటున్నారు. #west-godavari-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి