Soumya Shetty: అమ్మో.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్య మాములుది కాదుగా..!

విశాఖ రిటైర్డ్‌ పోస్టల్ అధికారి ఇంట్లో దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ సౌమ్య శెట్టిని నిందితురాలిగా గుర్తించారు. మొత్తం 4 విడతలుగా 100 గ్రా. బంగారు నగలు దోచినట్లు తెలిపారు. సౌమ్య గోవా ట్రిప్‌లో ఉండగానే అరెస్టు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలించారు.

New Update
Soumya Shetty: అమ్మో.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్య మాములుది కాదుగా..!

Actress Soumya Shetty Arrested : విశాఖలో ఓ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (Instagram Influencer) బండారం బయటపడింది. ఫ్రెండ్ ఇంట్లోనే ఏకంగా 100 గ్రాముల బంగారం కొట్టేసి గోవాకు వెళ్లి చిందులు వేస్తోంది. బంగారం పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలో దొండపర్తి బాలాజీ మెట్రో అపార్టుమెంటులో పోస్టల్ శాఖ రిటైర్డ్ అధికారి జనపాల ప్రసాద్ బాబు.. తన కూతురు మౌనికతో కలిసి నివాసముంటున్నారు.

గత 23న యలమంచిలిలో బంధువుల వివాహానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే, ఈ క్రమంలో బంగారు ఆభరణాల కోసం బీరువా లాకర్ తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందులోని 100 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో బీరువాపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు.

Also Read: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై భరత్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యాలు

తన కుమార్తె స్నేహితులైన కొంతమంది ఇంటికి వచ్చారని బాధితులు ప్రసాద్ బాబు అనుమానం వ్యక్తం చేశారు. బాత్రూమ్‌కి వెళ్లాలన్న సాకుతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చారని కూతురు మౌనిక తెలిపింది. దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అనుమానితులపై దర్యాప్తు చేపట్టారు. వీరిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ సౌమ్య శెట్టిని (Soumya Shetty) నిందితురాలిగా గుర్తించారు. మొత్తం 4 విడుతలుగా 100 గ్రాముల బంగారం దొంగతనం చేసినట్లు గుర్తించారు. చోరీ చేసిన నగలు అమ్మి గోవా ట్రిప్‌కు వెళ్లి రీల్స్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సౌమ్యను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. గత 8 ఏళ్లుగా సౌమ్య శెట్టికి రిటైర్డ్ పోస్టర్ అధికారి కూతురుతో స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. సౌమ్యకు షార్ట్‌ ఫిలిమ్స్‌ తీసే అలవాటు ఉండడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. స్నేహం కారణంగా తరచు రిటైర్డ్ పోస్టల్ అధికారి ఇంటికి వెళ్లేది సౌమ్య. ఈ క్రమంలోనే విడతల వారీగా బంగారం చోరీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు