Automobile: ఆ విషయంలో జపాన్ ని మనోళ్లు మళ్ళీ తోక్కేస్తున్నారు కార్ల అమ్మకాల్లో వరుసగా రెండో ఏడాదీ జపాన్ ను దాటిపోతోంది భారత్. ప్రపంచంలోనే కార్ల అమ్మకాల్లో మూడోస్థానంలో భారత్ చేరింది. ఇంతకు ముందు ఈ స్థానంలో జపాన్ ఉండేది. మార్చి నెలలో ఇప్పటివరకూ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఆటో ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 23 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Automobile: మార్చి చివరి నాటికి ముగిసే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కార్ల విక్రయాల కొత్త రికార్డు సృష్టించబోతున్నాయి. ఆటో పరిశ్రమ అంచనాల ప్రకారం, మొత్తం సంవత్సరంలో 42.3 లక్షల కార్ల అమ్మకాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇన్ని కార్లు అమ్ముడుపోలేదు. ఈ సేల్‌తో, వరుసగా రెండోసారి కార్ల అమ్మకాల పరంగా జపాన్‌ను భారత్ అధిగమించి ప్రపంచంలో మూడవ ర్యాంక్‌ను సాధించబోతోంది. ఈ లిస్ట్ లో భారత్ కంటే చైనా, అమెరికా మాత్రమే ముందుంటాయి. 2023లో జపాన్‌లో 39.9 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ప్రపంచంలో కార్ల(Automobile) అత్యధిక అమ్మకాల్లో చైనా మొదటి స్థానంలో, అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. గత ఏడాది మార్చిలో మనదేశంలో 3.36 లక్షల కార్లు విక్రయించగా, ఈ ఏడాది మార్చిలో భారతదేశంలో దాదాపు 3.75-3.80 లక్షల కార్లు అమ్ముడవుతాయని అంచనా. Also Read: మీది మారుతీ కారా? కంపెనీ వేలాది కార్లను వెనక్కి తీసుకుంటోంది.. మీదుందేమో? మార్చిలో అత్యధిక అమ్మకాల అంచనా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎంక్వయిరీస్ అలాగే బుకింగ్స్ పెరగడం మార్చిలో వాహన విక్రయాలకు(Automobile) సానుకూల సంకేతం కనిపించింది. మార్చి నెలలో మొత్తం దాదాపు 3.75 లక్షల అమ్మకాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఈనెలలో అత్యధికంగా చెబుతున్నారు. నెలవారీ అత్యధిక విక్రయాలు నమోదు కావడం ఇది వరుసగా 15వ నెల. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్-సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ, ఈ నెలాఖరులో రిటైల్ అమ్మకాలు స్వల్పంగా తగ్గుతాయని జాతీయ వార్తాపత్రిక ETకి తెలిపారు. దీనికి కారణం హోలీకి ముందు అననుకూల కాలం కారణంగా డిమాండ్ ప్రభావం కావచ్చు. అమ్మకాలు పెరుగుతాయని అంచనా ఈ క్యాలెండర్ ఇయర్‌లో కార్ల విక్రయాలు 5-7% పెరగవచ్చని ఇతర నిపుణులు అంటున్నారు. వాహనాలు ఖరీదైనప్పటికీ, డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. బ్యాంకులు వినియోగదారులకు సహేతుకమైన ధరలకు ఆటో రుణాలు ఇస్తున్నాయి. ఇది అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుంది అని ఆటో రంగ(Automobile) నిపుణులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. #automobile #indian-automobile-market మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి