IBSA: వరల్డ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా అమ్మాయిలు ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(IBSA)వరల్డ్ గేమ్స్‌లో భారత్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. తొలి ఎడిషన్‌లోనే స్వర్ణం గెలిచి రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. అయితే టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో మన అమ్మాయిలు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం విశేషం. By BalaMurali Krishna 26 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(IBSA)వరల్డ్ గేమ్స్‌లో భారత్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. తొలి ఎడిషన్‌లోనే స్వర్ణం గెలిచి రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కేవలం 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన మన అమ్మాయిలు సరికొత్త చరిత్రకు నాంది పలికారు. అయితే టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో మన అమ్మాయిలు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ జట్టు పరుగులు చేయడానికి చెమటోడ్చింది. దీంతో పవర్‌ప్లేలో కేవలం 29 పరుగులే చేసింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను లూయిస్, వెబెక్ ఆదుకున్నారు. అనంతరం భారత్ బౌలర్లు పుంజుకోవడంతో 16 పరుగుల వ్యవధిలోనే కంగారులు 5 వికెట్లు కోల్పోయింది. అయితే వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 42 పరుగుల లక్ష్యాన్ని ఇండియాకు టార్గెట్‌గా నిర్ణయించగా.. కేవలం 3.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. We couldn’t be more proud 🇮🇳 India Blind Women’s beat Australia in the Final World Games 2023#UPWarriorzUttarDega #IBSAWorldGames pic.twitter.com/ybXhMRkPTg — UP Warriorz (@UPWarriorz) August 26, 2023 ఇక మరోసారి భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. దాయాది దేశాల మధ్య ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. అదేంటి? ఆసియా కప్ టోర్నీకి ఇంకా టైం ఉంది కదా.. ఇప్పుడు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ మ్యాచ్ జరిగేది పురుషుల అంధుల క్రికెట్ జట్ల మధ్య. IBSA వరల్డ్ గేమ్స్‌లోపురుషుల అంధుల క్రికెట్‌లోనూ భారత్ జట్టు ఫైనల్ చేరింది. దీంతో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య తుది పోరు జరగనుంది. #ibsa-world-games #blind-cricket-team #indian-womens మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి