Water Drone: సరికొత్త వాటర్‌ డ్రోన్‌తో రెస్క్యూ ఆపరేషన్.. ఐడియా అదిరింది కదూ!

ఇండియన్ రెస్క్యూ అకాడమీ ఓ సరికొత్త వాటర్‌ డ్రోన్‌తో ముందుకొచ్చింది. భారీ వరదల సమయంలో ఈ వాటర్‌ డ్రోన్‌ ప్రజలను రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ డ్రోన్‌ 100 కిలోల వరకు బరువును మోయగలదు. ఆపదలో ఉన్న వ్యక్తులను రక్షించగలదు.

Water Drone: సరికొత్త వాటర్‌ డ్రోన్‌తో రెస్క్యూ ఆపరేషన్.. ఐడియా అదిరింది కదూ!
New Update

Water Drone: వానలు, వరదలు దేశాన్ని ముంచెత్తడం సాధారణంగా మారిపోయిన రోజులివి. సీజన్‌తో సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం వరదలు సంభవిస్తుంటాయి. ఆ సమయంలో రెస్క్యూ టీమ్స్‌ తమ ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న వారిని కాపాడుతుంటాయి. అలాంటి టీమ్స్‌కు హెల్ప్‌ చేసేందుకు ఇండియన్ రెస్క్యూ అకాడమీ ఓ సరికొత్త వాటర్‌ డ్రోన్‌తో ముందుకొచ్చింది. భారీ వరదల సమయంలో ఈ వాటర్‌ డ్రోన్‌ ప్రజలను రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ వాటర్ డ్రోన్ ఫీచర్లు ఇవే:

  • అధిక సామర్థ్యం ఉన్న జెట్ పంప్‌తో ఈ డ్రోన్ నీటిలో ప్రయాణిస్తుంది ఆధారితం. ఎంతో వేగాన్ని కలిగి ఉన్న ఈ డ్రోన్‌తో వరదలో చిక్కుకున్న వారి దగ్గరకు ఈజీగా చేరుకోవచ్చు. నిజానికి పడవలతో వెళ్తే రెస్క్యూ చేయడం కాస్త లేట్ అవుతుంది. ఈ నీటి డ్రోన్‌తో మాత్రం బాధితుల దగ్గరకు త్వరగా చేరుకోవచ్చు. అంతేకాదు కఠినమైన సముద్ర వాతావరణాలను తట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఇది 1.25 మీటర్ల వరకు ఎగిసే అలల ఎత్తును దాటుకోని ప్రయాణించగలదు.
  • ఈ డ్రోన్‌ 100 కిలోల వరకు బరువును మోయగలదు. ఇది అవసరమైన సామాగ్రిని రవాణా చేయడానికి లేదా ఆపదలో ఉన్న వ్యక్తులను రక్షించడంలో సమాయపడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్‌లోని అనేక ప్రాంతాలను భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో ఈ డ్రోన్ తయారీకి ఇండియన్ రెస్క్యూ అకాడమీ పూనుకుంది. ప్రాణాలను రక్షించడానికి రెస్క్యూ టీమ్‌లకు ఇది యూజ్ అవుతుందని అకాడమీ చెబుతోంది. అటు నెటిజన్లు సైతం ఈ డ్రోన్ తయారీని మెచ్చుకుంటున్నారు. అయితే కేవలం మనుషులనే కాకుండా వరదల్లో చిక్కుకున్న జంతువులను కూడా కాపాడేందుకు ఈ డ్రోన్‌ని ఉపయోగించాలని కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ సంవత్సరం ఫ్రెండ్‌షిప్ డే ఎప్పుడు? దాని చరిత్ర తెలుసుకోండి!

#water-drone
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe