India Today Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. ఇండియా టుడే సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని తేల్చి చెప్పింది ఇండియా టుడే ఫైనల్ ఎగ్జిట్ పోల్స్. తెలంగాణలో బీఆర్ఎస్ - 34-44, కాంగ్రెస్ 63-73, బీజేపీ 4-8, ఇతరులు 5-8 సీట్ల చొప్పున గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది.

India Today Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. ఇండియా టుడే సంచలన రిపోర్ట్..
New Update

India Today Exit Polls of Telangana: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, అధికారం ఎవరది అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని కాంగ్రెస్ పార్టీదే మెజార్టీ అని చెబితే.. మరికొన్ని బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్పాయి. మరికొన్ని హంగ్‌ ను సూచించాయి. ఇలా ఒక్కొక్క సర్వే ఒక్కొక్కలా చెప్పడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ పోలింగ్ ముగిసే సమయానికి మాత్రమే అంచనా వేసి లెక్కలు వెళ్లడించాయి. తాజాగా ఇండియా టుడే ఫైనల్ ఎగ్జిట్ పోల్స్‌ని విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయంటే..

సీట్ల వారీగా వివరాలు..

👉బీఆర్‌ఎస్ - 34-44

👉కాంగ్రెస్ - 63-73

👉బీజేపీ - 4-8

👉ఇతరులు - 5-8

ఓట్ షేర్...

👉 బీఆర్ఎస్ పార్టీకి రూరల్‌లో 35 (గతంలో కంటే 13 శాతం తగ్గుదల(-13)) శాతం, పట్టణ ప్రాంతంలో 36(-10) శాతం పోలింగ్ నమోదైంది.

👉 కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతంలో 44(+9) శాతం, పట్టణ ప్రాంతంలో 41(+14) శాతం పోలింగ్ నమోదైంది.

👉 బీజేపీకి గ్రామీణ ప్రాంతంలో 14 (+8), పట్టణ ప్రాంతంలో 15 (+6) శాతం.

👉 ఎంఐఎం పార్టీకి గ్రామీణ ప్రాంతంలో ఏమీ లేదు. పట్టణ ప్రాంతంలో 7 శాతం పోలింగ్.

👉 ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో 7 (-4) శాతం, పట్టణ ప్రాంతంలో 1 (-10) శాతం పోలింగ్ నమోదైంది.

సీఎంగా కేసీఆర్‌కే జై..

తెలంగాణలో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారనే దానిపై ఇండియా టుడే యాక్సిస్‌ మై ఇండియా అంచనాలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్‌ను సీఎంగా 32శాతం మంది కోరుకుంటున్నారు. రేవంత్‌ను సీఎంగా 21శాతం మంది కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి వేరే వ్యక్తిని సీఎంగా 22శాతం మంది కోరుకుంటున్నారు. బీజేపీ నుంచి ఎవరు సీఎంగా ఓకే అని 12 శాతం మంది అంటున్నారు. ఇక రేవంత్‌ కంటే కాంగ్రెస్‌ నుంచి ఎవరు సీఎం అయినా పర్వాలేదని 22శాతం మంది అభిప్రాయపడ్డారు.

Also Read:

చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?

#india-today-final-exit-polls #exit-polls-of-telangana #india-today-final-exit-polls-of-telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి