పారా ఒలింపిక్స్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ ! ఒలింపిక్స్ లో భారత్ వరుసగా రెండోసారి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. గ్రూప్ లీగ్ లో ఐర్లాండ్ జట్టు తో జరిగిన మూడవ మ్యాచ్ లో భారత్ 2-0 తో విజయం సాధించింది. భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో 7 పాయింట్లతో పూల్ -బీ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కు చోటు దక్కించుకుంది. By Durga Rao 31 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఆస్ట్రేలియా, బెల్జియం, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్ లాంటి హేమాహేమీజట్లతో కూడిన పూల్ -బీ లీగ్ మొదటి మూడురౌండ్ల మ్యాచ్ ల్లో భారత్ రెండు విజయాలతో అజేయంగా నిలిచింది. గ్రూప్ తొలిమ్యాచ్ లో న్యూజిలాండ్ పై గట్టిపోటీ ఎదుర్కొని విజయం సాధించిన భారత్..రెండోరౌండ్లో పవర్ ఫుల్ అర్జెంటీనాతో హోరాహోరీగా సాగిన పోరులో ఆఖరి నిముషం గోలుతో మ్యాచ్ ను 1-1తో డ్రాగా ముగించడం ద్వారా ఊపిరిపీల్చుకోగలిగింది. ఆట మొదటి భాగం 11, 19 నిముషాలలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ అందించిన పెనాల్టీ కార్నర్ గోల్స్ తో 2-0తో పైచేయి సాధించినా ..రెండో భాగంలో ఒక్కగోలూ చేయలేకపోయింది. పైగా ..ప్రత్యర్థి ఐర్లాండ్ కు 10 పెనాల్టీకార్నర్ లు సమర్పించుకొని..పటిష్టమైన డిఫెన్స్ తో కాచుకోవాల్సి వచ్చింది. భారత దిగ్గజ గోల్ కీపర్ శ్రీజేష్ మరోసారి తన అనుభవాన్నంతా ఎదుర్కొని ప్రత్యర్ధిజట్టుకు గోల్ కాకుండా నిలువరించగలిగాడు. దీంతో భారత్ 2-0 గోల్స్ తో రెండో విజయం సాధించడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను 7కు పెంచుకొంది. భారతజట్టు మొదటి మూడు గేమ్ ల్లో సాధించిన మొత్తం 6 గోల్స్ లో భారత కెప్టెన్ కమ్ పెనాల్టీకార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఒక్కడే నాలుగు గోల్స్ చేయడం ద్వారా టాపర్ గా నిలిచాడు. ఆడిన మొదటి మూడురౌండ్ల మ్యాచ్ ల్లోనూ అజేయంగా నిలవడం ద్వారా భారత్ 7 పాయింట్లతో పూల్ -బీ నుంచి క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో చోటు సంపాదించగలిగింది. #hockey-quarter-finals #para-olympics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి