Ind vs Ned: టీమిండియా దీపావళి కానుక.. నెదర్లాండ్‌పై 160 పరుగుల తేడాతో ఘన విజయం..

ప్రపంచకప్ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అండ్ టీమ్ నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా 9వ విజయం. లీగ్ దశలో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది.

New Update
Ind vs Ned: టీమిండియా దీపావళి కానుక.. నెదర్లాండ్‌పై 160 పరుగుల తేడాతో ఘన విజయం..

ICC World Cup 2023: ప్రపంచకప్-2023 లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు కేవలం 250 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది వరుసగా 9వ విజయం. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. టోర్నీలో టీమిండియా అజేయంగా నిలిచింది. ఇప్పుడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ నవంబర్ 15న జరుగనుంది.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లు అద్భుతంగా రాణించారు. ఇద్దరూ అద్భుత సెంచరీలు చేశారు. రాహుల్ 102 పరుగులతో, అయ్యర్ 128 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ రోహిత్ శర్మ 61, శుభ్‌మన్ గిల్ 51, విరాట్ కోహ్లీ 51 పరుగులు చేశారు. బౌలర్ల విషయానికి వస్తే.. బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్ తలో 2 వికెట్లు తీశారు. కోహ్లి, రోహిత్ చెరో వికెట్ తీశారు.

భారత ఇన్నింగ్స్‌..

భారత జట్టు చివరి 10 ఓవర్లలో 122 పరుగులు చేసి.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తర్వాత టోర్నీలో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో జట్టుగా నిలిచింది. ఇక అయ్యర్‌కి ఇది నాల్గవ వన్డే సెంచరీ. ప్రపంచ కప్‌లో మొదటి సెంచరీ. గిల్, రోహిత్‌లు తొలి వికెట్‌కు 71 బంతుల్లో 100 పరుగులు చేసి భారత్‌కు శుభారంభం అందించారు. ఆ సమయంలో ఎంటరైన శ్రేయాస్ అయ్యరు.. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ అండ్ కవర్‌పై 80 మీటర్ల రెండు భారీ సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. మొత్తంగా 84 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు శ్రేయాస్ అయ్యర్. ఇక కేఎల్ రాహుల్ కేవలం 62 బంతుల్లోనే సెంబచరీ పూర్తి చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఇదే.

Also Read:

మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే..

Advertisment
Advertisment
తాజా కథనాలు