/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Virat-Kohli-1-jpg.webp)
ICC ODI World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రేమికులను అలరిస్తోంది. తమ ఆల్ రౌండ్ ఆటతో అభిమానులను మాంచి కిక్కు ఇస్తున్నారు టీమిండియా ప్లేయర్స్. సెమీఫైనల్‌కు ముందు దీపావళి రోజున చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్‌తో తలపడిన టీమ్ ఇండియా.. క్రికెట్ ప్రియులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తొమ్మిదేళ్ల తరువాత అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయలేకపోయాడు కానీ.. 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదండోయ్.. వరల్డ్ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ తొలి వికెట్ తీసుకున్నాడు.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అభిమానులను ఎంతగానో అలరించింది. తొలుత శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీలు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన అర్ధశతకాలు సాధించారు. వీరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 410 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత, బౌలర్లు సైతం అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా అభిమానుల డిమాండ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈసారి బౌలింగ్‌లో హైలైట్‌గా నిలిచారు.
అభిమానానికి తలొగ్గిన రోహిత్..
అంతకుముందు టోర్నీలో కోహ్లి బంగ్లాదేశ్‌పై బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఓవర్‌ను పూర్తి చేసేందుకు 3 బంతులు వేశాడు. అప్పటి నుంచి మళ్లీ కోహ్లీ బౌలింగ్‌ను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదట శ్రీలంకతో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లలో స్టేడియంలో ఉన్న అభిమానులు చాలాసార్లు నినాదాలు చేశారు. కోహ్లీకి బౌలింగ్ ఇవ్వమని కెప్టెన్ రోహిత్‌ను డిమాండ్ చేశారు. ఈసారి బెంగళూరు అభిమానులు కూడా అదే నినాదాలు చేశారు. దాంతో విరాట్ వారి డిమాండ్‌ను అంగీకరించి.. కోహ్లీకి బౌలింగ్ ఇచ్చాడు. ఇంకేముందు.. కోహ్లీ తన అభిమానులకు దీపావళి కానుక ఇచ్చాడు.
View this post on Instagram
View this post on Instagram
9 ఏళ్ల తర్వాత వికెట్.. పండగ చేసుకున్న అభిమానులు..
గాయం కారణంగా సిరాజ్ బౌలింగ్ వేయలేకపోయాడు. దాంతో కోహ్లీకి బౌలింగ్ ఇచ్చారు. 23వ ఓవర్‌లో కోహ్లీకి బంతి అందడంతో చెలరేగిపోయాడు కోహ్లీ. తొలి ఓవర్‌లో కోహ్లీ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తరువాత మరో ఓవర్‌లో వచ్చ మూడో బంతికే వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. దాంతో చిన్నస్వామి స్టేడియంలో సందడి నెలకొంది. బంతి లెగ్ స్టంప్ దగ్గర షార్ట్ పిచ్ చేయబడింది. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఆ బంతిని ఫైన్ లెగ్‌లో ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి కాస్తా బ్యాట్‌ను టచ్ చేస్తూ కీపర్ రాహుల్ చేతికి చిక్కింది. ఎడ్వర్డ్ ఔట్ అయ్యాడు. ఈ ఔట్‌ను చూసి కోహ్లీ కూడా కాసేపు షాక్ అయ్యాడు. ఫుల్ ఖుషీ అవుతూ వికెట్‌ను ఎంజాయ్ చేశాడు కోహ్లీ. ఇక స్టేడియంలో అభిమానులకైతే పూనకాలే వచ్చాయనుకోవచ్చు. వికెట్ తీయగానే.. కోహ్లీ, కోహ్లీ అంటూ నినాదాలతో స్టేడియం మొత్తం మారుమోగిపోయింది.
Kohli ko bowling do part 3 pic.twitter.com/sWgCW5luXS
— A (@_shortarmjab_) November 12, 2023
🚨 VIRAT KOHLI STRIKES 🚨
Right arm quick impact in Bengaluru 😎
KL Rahul with another fine catch!#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNEDpic.twitter.com/1Mir0kq2fq
— BCCI (@BCCI) November 12, 2023
9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ వికెట్ తీశాడు. అంతకుముందు 2014లో న్యూజిలాండ్‌తో జరిగిన నేపియర్ వన్డేలో బ్రెండన్ మెకల్లమ్ వికెట్ తీశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది ఐదో వికెట్. ఈ మ్యా్చ్‌లో ఓవరాల్‌గా కోహ్లీ 3 ఓవర్లు నిరంతరం బౌలింగ్ చేసి 13 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. దీపావళి రోజున టీమిండియాకు, ముఖ్యంగా కోహ్లీ తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు.
Who else but Captain Rohit Sharma with the final wicket of the match! 😎#TeamIndia complete a 160-run win in Bengaluru 👏👏
Scorecard ▶️ https://t.co/efDilI0KZP#CWC23 | #MenInBlue | #INDvNEDpic.twitter.com/PzyQTi3QZV
— BCCI (@BCCI) November 12, 2023
రోహిత్ చివరి వికెట్..
ఇక 47వ ఓవర్ వేసిన రోహిత్ శర్మ కూడా వికెట్ తీశాడు. రోహిత్ టాస్డ్ డెలివరీ వేయగా.. తేజ నిడమనూరు షాట్‌కు ట్రై చేశాడు. కానీ, బంతి స్వింగ్ అవడంతో.. లాంగ్ ఆన్ నుంచి వచ్చి షమి చేతికి చిక్కింది. దాంతో లాస్ట్ వికెట్ అయిన తేజ నిడమనూరు క్యాచ్ ఔట్ అయ్యాడు. టీమిండియా 160 భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Also Read: