How to Survive a Heart Attack: ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, వర్కౌట్ తక్కువగా చేయడం, మద్యపానం, ధూమపానం, మిగతా కారణాల వల్ల గుండె సమస్యలు వస్తాయి. వీటి విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా, సమస్య లక్షణాలు, సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కచ్చితంగా అవగాహన ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా గోల్డెన్ అవర్ గురించి తెలుసుకోవాలి. అసలు గోల్డెన్ అవర్ అంటే ఏంటి.. ఆ సమయంలో ఏం చేయాలి.. ఇలా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గుండెపోటు వచ్చినప్పుడు చాలా మందికి దడగా అనిపిస్తుంది. దవడ, మెడ ప్రాంతంలో నొప్పిగా అనిపిస్తుంది. ఎడమ చేయి వైపు లేదా రెండు చేతుల్లో కూడా నొప్పి వస్తుంది. శరీరంలో పై భాగంలో ఇబ్బంది, నొప్పిగా అనిపించడం, ఛాతీలో నొప్పిగా అనిపించి శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా సరైన సమయంలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి.
Also Read: పసుపు పాలు లేదా నీరు? ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
కొంతమంది పేషెంట్స్ హార్ట్ ఎటాక్ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటారు. వాటిని పట్టించుకోరు, గ్యాస్, అసిడిటీ వల్ల ఈ లక్షణాలు ఉన్నాయని అనుకుంటారు. అయితే, ఇలాంటి అసిడిటీ నొప్పులైనా సరే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ సమస్యల కోసమైనా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. కానీ, నిజంగానే గుండెనొప్పి వస్తే పరిస్థితి ఏంటి.. అందుకే లక్షణాలు కనిపించగానే అస్సలు నిర్లక్ష్యం వద్దు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు.
గుండె పోటు వచ్చిన సమయంలో సరైన సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళడాన్ని గోల్డెన్ అవర్ అంటారు. అది ఎప్పుడంటే లక్షణాలు కనపించిన మొదటి గంట లోపు హాస్పిటల్‌కి వెళ్ళడాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో రోగిని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల అతడిని కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ ఒక్కగంటే మన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.