Curd: భారతీయ భోజనంలో.. పెరుగు ఎందుకు ఉంటుందో తెలుసా..?

సాధారణంగా ఇండియన్ మీల్స్ లో పెరుగు ఖచ్చితంగా ఉంటుంది. అయితే చివరిగా పెరుగు ఎందుకు తింటారో ఎప్పుడైనా ఆలోచించారా..? దీంట్లో పుష్కలమైన పోషకాలతో పాటు జీర్ణక్రియను చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. అలాగే భోజనంలోని అన్ని రుచులను బ్యాలెన్స్ చేసే సామర్థ్యం పెరుగుకు ఉంటుంది.

New Update
Curd: భారతీయ భోజనంలో.. పెరుగు ఎందుకు ఉంటుందో తెలుసా..?

Eating Curd: భారతీయ భోజనంలో చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ ఇలా ఎన్ని రకాల స్పెషల్ డిషెస్ ఉన్నప్పటికీ చివరిగా పెరుగు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రకరకాల వంటకాలు తిన్నప్పటికీ లాస్ట్ లో పెరుగుతో తింటే వచ్చే ఫీలింగ్ ఏ వేరు. తినడం బాగానే ఉంటుంది కానీ భోజనం చివరిలోనే పెరుగు ఎందుకు తింటారో ఎప్పుడైనా ఆలోచించారా..? దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇండియన్ మీల్స్ లో పెరుగు ఎందుకు..?

జీర్ణక్రియ లాభాలు

పెరుగులో ప్రీ బయోటిక్ లక్షణాలు మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఉపయోగపడి.. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

చల్లదనాన్ని అందిస్తుంది

సహజంగా పెరుగుకు చలువ చేసే గుణాలు ఉంటాయి. ఘాటు, వేడి చేసే ఆహారాలు తిన్నప్పుడు పెరుగు తింటే.. శరీరం పై వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఘాటు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే నాన్ వెజ్ చివరిలో కాస్త పెరుగు తినడం మంచిదని చెబుతారు.

Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

publive-image

పుష్కలమైన పోషకాలు

క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. చర్మ సౌందర్యానికి కూడా పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది.

బ్యాలెన్సింగ్ ఫ్లేవర్స్

తేలికగా, క్రీమీ స్వభావం కలిగిన పెరుగు.. ఘాట్ తో కూడిన రుచులను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. విపరీతమైన స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు పెరుగు తినడం సరైన ఎంపిక.

సాంస్కృతిక ప్రాముఖ్యత

భోజనంలో పెరుగు అనేది భారతీయ సాంప్రదాయంలో లోతుగా ఇమిడిపోయింది. అందుకే భారతీయ వంటకాల్లో పెరుగు తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఒక సాంప్రదాయమే కాదు శాస్త్రీయంగా కూడా పెరుగు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి.

Also Read: Pre Heating Foods: ఈ ఆహారాలు వేడి చేసి తింటున్నారా..? అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు