Telangana: తెలంగాణకు వాయుగుండం ముప్పు!

తెలంగాణకు ఆదివారం వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో వాయుగుండం తెలంగాణ మీదుగా కదలబోతున్నట్లు అధికారులు వివరించారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు రెడ్‌ , ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ లను జారీ చేశారు.

New Update
Telangana: తెలంగాణకు వాయుగుండం ముప్పు!

Telangana: తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రానున్న 24 గంటల్లో వాయుగుండం తెలంగాణ మీదుగా కదలబోతున్నట్లు అధికారులు వివరించారు. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్స్‌ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకిపోతున్నాయి. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రెడ్‌ ఎలెర్ట్‌ ప్రకటించిన జిల్లాలు... ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల

ఐఎండీ ఆరెంజ్‌ ఎలెర్ట్‌ ప్రకటించిన జిల్లాలు: కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి

ఎల్లో ఎలెర్ట్‌ ప్రకటించిన జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌.

Also Read: లాంచ్ ఎపిసోడ్ ప్రోమో.. నాని, రానా, అనిల్ రావిపూడి సందడి..!

Advertisment
తాజా కథనాలు