Health benefits: కర్పూర వాసన పీలిస్తే ఈ సమస్యలన్నీ దూరం!

కర్పూరాన్ని మనం దేవుడి పూజలు, హారతుల్లో వాడుతుంటాం. దీని వాసన చాలా మందికి ఇష్టం. అయితే, కేవలం దీని కోసమే కాదు. ఈ కర్పూరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలుసా. అవేంటో తెలుసుకోండి.

New Update
Health benefits: కర్పూర వాసన పీలిస్తే ఈ సమస్యలన్నీ దూరం!

కర్పూరాన్ని మనం దేవుడి పూజలు, హారతుల్లో వాడుతుంటాం. దీని వాసన చాలా మందికి ఇష్టం. అయితే, కేవలం దీని కోసమే కాదు. ఈ కర్పూరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలుసా. . అయితే, దీనిని ఎందుకు వాడతారంటే దీనిని వాడడం వల్ల ఆ వాసనకి నెగెటివిటీ దూరమవుతుందని. కేవలం ఈ ప్రయోజనం మాత్రమే కాదు.  అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని వాసనని పీల్చుకోవడంతో చాలా సమస్యలు దూరమవుతాయి.

కర్పూర ప్రయోజనాలు..

ప్రతిరోజూ కర్పూరాన్ని వాడితే అది మీ ఒత్తిడి, ఆందోళనని దూరం చేస్తుంది.
జులుబ, దగ్గు వంటి సమస్యల్ని దూరం చేయాలనుకుంటే కర్పూరం వాసనని రెగ్యులర్‌గా పీల్చుకోండి.
కర్పూర ప్రభావం కారణంగా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
ఈ వాసనని పీల్చడం వల్ల అలసట దూరమవుతుంది.
దీని వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది.
మలబద్ధకం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు కర్పూర వాసనతో దూరమవుతాయి.
కర్పూరంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ప్రమాదకరమైన సూక్ష్మక్రిములని దూరం చేస్తాయి.

​కర్పూరాన్ని పొడిలా చేసి రాస్తే నొప్పి, దురద వంటి సమస్యలు దూరమవుతాయి. తీవ్రమైన నొప్పికి కర్పూరాన్ని మందుగా వాడొచ్చు. చర్మంపై రాసినప్పుడు ఇది వెచ్చని అనుభూతిని ఇస్తుంది. కండరాలు, కీళ్ళలో నొప్పిని కూడా తగ్గిస్తుంది.జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు చేతి రుమాలులో కర్పూరాన్ని పెట్టి దానిని వాసనని పీల్చుకోండి. తీని వల్ల వారికి చాలా వరకూ ఉపశమనం ఉంటుంది.కర్పూరాన్ని వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని నేరుగా ముక్కులో వేయొద్దు. దీని వల్ల ఇతర సమస్యలు వస్తాయి. కొంతమందికి కర్పూరం పడదు. అలాంటప్పుడు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Advertisment
తాజా కథనాలు