Mahashivratri 2024 : మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే..లక్ష్మీదేవి నట్టింట్లో కూర్చున్నట్లే.!

శివపురాణం ప్రకారం..మహాశివరాత్రి రోజు శివుడు, పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. మహాశివరాత్రి రోజు నుంచి సృష్టి ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజు ఇలాంటి పనులు చేస్తే డబ్బులకు కొదవ ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకి వెళ్లాల్సిందే.

New Update
Mahashivratri 2024 : మహాశివరాత్రి రోజు ఇలా చేస్తే..లక్ష్మీదేవి నట్టింట్లో కూర్చున్నట్లే.!

Mahashivratri 2024 : మహాశివరాత్రి..శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ. మహాశివరాత్రి అనేది శివ, శక్తి కలయికతో ఏర్పడే గొప్ప పండుగ. శివపురాణం ప్రకారం..మహాశివరాత్రి రోజు శివుడు, పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి రోజునుంచి ఈ స్రుష్టి ప్రారంభమైందని నమ్ముతుంటారు. గరుడు పురాణం, స్కందపురాణం, పద్మ పురాణం, అగ్నిపురాణం మొదలైన వాటిలో శివరాత్రి గురించి క్లుప్తంగా వివరించారు. శివరాత్రి రోజు బిల్వపత్రాలతో మహాశివుడిని పూజించి...రాత్రిపూట జాగరణతోపాటు శివమంత్రాలను జపిస్తే..శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. అయితే ఇంట్లో సుఖశాంతులు, శాంతి, సంపదలు కలగాలంటే మహాశివరాత్రి నాడు ఏం చేయాలో చూద్దాం.

1. శివలింగానికి అన్నం నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మహాశివరాత్రి నాడు శివలింగంపై అన్నం నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని ఆర్థిక సమస్యలు తీరుతాయి.

2. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే మహాశివరాత్రి రోజు శివలింగానికి కొన్ని బియ్యపు గింజలు, ఒక రూపాయి నాణేన్ని సమర్పించండి.

3. మీరు మీ కోరికలను నెరవేరాలంటే, మహాశివరాత్రి నాడు శంకర భగవానుడికి బిల్వపత్రాన్ని సమర్పించండి.

4. మహాశివునికి 11బిల్వ ఆకులను సమర్పిస్తే..మీ కోరికలన్నీ నెరవేరుతాయి. బిల్వపత్రాన్ని అందించే సమయంలో మూడు ఆకులు అలాగే ఉండాలి.

5. మహాశివరాత్రి రోజున ఆవు లేదా ఎద్దుకు పచ్చి మేత తినిపించాలి.

6. మీ జాతకంలో గ్రహదోషం, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటే.. మహాశివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

7. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే.. శివరాత్రి రోజున భార్యాభర్తలు కలిసి రుద్రాభిషేకం చేయాలి. ఈ పరిహారం మీ జీవిత సమస్యలను పరిష్కరిస్తుంది.

8. మీకు వివాహం ఆలస్యమైతే పార్వతీ దేవికి ఎర్రబట్టలో పచ్చిమిర్చి పెట్టి సమర్పించండి.

9. ఆరోగ్యంగా ఉండాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. ఈ రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల శంకరుని అనుగ్రహం లభిస్తుంది. రాగి పాత్రలో శివలింగానికి పాలు ఎప్పుడూ సమర్పించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి:  సింగరేణి ఉద్యోగులకు అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ సర్కార్..ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు