అల్యూమినియం పాత్రల్లో ఆహారం వండితే అనారోగ్యం తప్పదా?

అల్యూమినియం లోహం అనేది చాలా తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. స్టీల్, బ్రాస్ లతో పోలిస్తే మంచి హీట్ కండక్టర్ గా పనిచేస్తుంది. మనం నిత్యం వంటలు ఈ అల్యూమినియం పాత్రలతోనే చేస్తుంటాం.అయితే ఈ పాత్రలలో వండినవి తింటే అనారోగ్యం తప్పదా?

New Update
అల్యూమినియం పాత్రల్లో ఆహారం వండితే అనారోగ్యం తప్పదా?

అల్యూమినియం లోహం అనేది చాలా తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. స్టీల్, బ్రాస్ లతో పోలిస్తే మంచి హీట్ కండక్టర్ గా పనిచేస్తుంది. మనం నిత్యం వంటలు ఈ అల్యూమినియం పాత్రలతోనే చేస్తుంటాం. వీటిని వాడే సమయంలో గ్యాస్ కూడా అధికంగా ఆదా అవుతుంది. అందుకనే ఈ అల్యూమినియం పాత్రలను అధికంగా ఇళ్లలోనూ, ఫాస్ట్ ఫుడ్స్, పెద్ద పెద్ద వంటల తయారీలో వినియోగిస్తారు. అయితే సోషియల్ మీడియాలో అధికంగా ఈ అల్యూమినియం పాత్రలపై అనేక వదంతులు వస్తున్నాయి.

అల్యూమినియం పాత్రలు అతిగా వాడితే రోగాలు తప్పవని కొందరు హెచ్చరిస్తున్నారు. నిజంగానే అల్యూమినియం పాత్రలు వాడకం హానికరమా…?? అందులో వంటలు చేసుకోవడం ద్వారా విష రసాయనాలు ఆహారంలో కలుస్తాయా…?? నిమిషాల్లో వంట అవ్వడానికి… గ్యాస్ ఆదా చేయడానికి ఎప్పటి నుంచో అధికంగా అల్యూమినియం పాత్రలను వినియోగిస్తూ ఉంటాం. ఈ అల్యూమినియం లోహం మంచి హీట్ కండక్టర్ అని అందరికీ తెలుసు. వాడే విధానంలో తేడా వస్తే ఆహారం విషతుల్యం అవుతుందట. ఇక అల్యూమినియం పాత్రలను ప్రత్యేక విధానంలో శుభ్రపరిస్తే ఎలాంటి హాని ఉండదని అంటున్నారు.

అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు పరిశోధకులు. అల్యూమినియంను ఏ విధంగానూ మానవ జీర్ణ ప్రక్రియ జీర్ణం చేసే శక్తి ఉండదని అంటున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్లు అసలు అల్యూమినియం పాత్రలు వినియోగించకూడదట. ఈ అల్యూమినియం పత్రాలు అధికంగా వినియోగించడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలిందట. పులుపు ఉన్న వస్తువులతో అల్యూమినియం రియాక్ట్ అవుతుందట. పులుపుతో రసాయన చర్య జరిపితే అల్యూమినియం క్లోరైడ్ విడుదల చేస్తుందని… ఇది మానవ శరీరానికి హానికరమని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు