IDFC Bank: టీమిండియా టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకున్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్

IDFC బ్యాంక్ టీమిండియా స్పాన్సర్‌గా జాక్‌పాట్ కొట్టేసింది. స్వదేశంలో భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచుల టైటిల్ హక్కులను దక్కించుకుంది. ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి దాదాపు రూ.1000కోట్ల ఆదాయం సమకూరనుంది.

New Update
IDFC Bank: టీమిండియా టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కించుకున్న ఐడీఎఫ్‌సీ బ్యాంక్

IDFC Bank: ఒక్కో ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు రూ. 4.2కోట్లు..

ప్రైవేట్ బ్యాంక్‌గా గుర్తింపు పొందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ(IDFC)టీమిండియా స్పాన్సర్‌గా జాక్‌పాట్ కొట్టేసింది. స్వదేశంలో భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచుల టైటిల్ హక్కులను దక్కించుకుంది. ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి (BCCI) దాదాపు రూ.1000కోట్ల ఆదాయం సమకూరనుంది. ఇండియాలో ఒక్కో ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు రూ. 4.2కోట్లు చెల్లించేలా హక్కులను పొందింది. గతంతో పోలిస్తే రూ.40లక్షలకు పైగా ఎక్కువ చెల్లించనుంది. బిడ్డింగ్ బేస్ ధర రూ.2.4 కోట్లుగా నిర్ణయించారు.

బీసీసీఐకి రూ.1000కోట్ల ఆదాయం.. 

2026 ఆగస్టు వరకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ఇండియా ఆడే మూడు టీ20ల సిరీస్ నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ మూడేళ్ల కాలంలో మొత్తం 56 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (56 International Matches) టైటిల్ స్పాన్సర్ చేయనుంది. ఈ ఒప్పందం ద్వారా BCCIకి రూ. 987.84కోట్లు ఆదాయం సమకూరనుంది. మొదటిసారి టైటిల్ స్పాన్సర్‌షిప్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ అయిన సోనీ స్పోర్ట్స్ (Sony Sports) నుండి IDFC గట్టి పోటీని ఎదుర్కొంది. చివరకు IDFC స్పాన్సర్‌షిప్‌ హక్కులు దక్కించుకుందని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్‌ (Cricbuzz) తెలిపింది.

ఇది కూడా చదవిండి: ప్రజ్ఞానందది ఓటమి కాదు.. గెలుపే.. ట్విట్టర్ రియాక్షన్స్!

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్..

ఇక భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. అక్టోబర్ 5వ తేదీన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. ఇక యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసే భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా అక్టోబ‌ర్ 14న జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.

అయితే ఐసీసీ(ICC) ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు చేసింది. భారత్, పాక్ మ్యాచ్ స‌హా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చేసింది. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య అక్టోబ‌ర్ 15న మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే అక్టోబ‌ర్ 15 నుంచి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం కానుండటంతో భ‌ద్ర‌తా కార‌ణాలను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 14కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవిండి: Asia Cup: బీసీసీఐ తప్పు చేస్తుందా? ఆ ముగ్గురు ఆటగాళ్లతో సమస్యలు తప్పవా?

Advertisment
Advertisment
తాజా కథనాలు