Male Contraceptive: పురుషులకు గుడ్ న్యూస్.. ఇక కండోమ్ అససరం లేదు.. ఎందుకో తెలుసా?

పురుషులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌. శృంగారం సమయంలో కండోమ్‌ యూజ్‌ చేయకుండా గర్భనిరోధక ఇంజెక్షన్‌ తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజెక్షన్‌ తయారు చేసిన ICMR తొలి విడత ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. ఎలాంటి సమస్యలు లేకుండా ఈ ఇంజెక్షన్‌ 99.02శాతం సమర్థవంతంగా పని చేసిందని అధ్యయనం తేల్చింది.

New Update
Male Contraceptive:  పురుషులకు గుడ్ న్యూస్.. ఇక కండోమ్ అససరం లేదు.. ఎందుకో తెలుసా?

Male Contraceptive: గర్భం రాకుండా ఉండేందుకు అనేక పద్ధతులున్నాయి. ఇందులో కండోమ్ వాడడం లేదా గర్భనిరోధక మాత్రలు వాడడం లేదో గర్భాన్ని నిరోధించే ఇంజెక్షన్‌ తీసుకోవడం లాంటివి ఉన్నాయి. ఇందులో కండోమ్‌ని అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ వాడే అవకాశం ఉంది. ఇక ఇంజెక్షన్‌ విషయానికి వస్తే అది ఇప్పటివరకు మహిళలే వాడుతున్నారు. ప్రత్యేకంగా పురుషుల కోసం ఇంజెక్షన్ లేదు. అయితే పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజెక్షన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తయారు చేస్తోంది. తొలి గర్భనిరోధక ట్రయల్ సక్సెస్‌ కూడా అయ్యింది. ఈ ప్రయోగాన్ని 7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మొత్తం 303 మంది పురుషులపై ఈ ప్రయోగం చేశారు. వీరంతా ఆరోగ్యంగా ఉన్న పురుష వాలంటీర్లు. 25-40 ఏళ్ల మధ్యవారిపై ఈ అద్యయనం చేశారు.

సురక్షితమైనదేనా?
ఈ నాన్-హార్మోనల్ ఇంజెక్షన్‌.. RISUG-రిసాగ్‌ (రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్) పూర్తిగా సురక్షితమైనదని, ప్రభావవంతమైనదని ఈ అధ్యయనం చెబుతోంది. ఇప్పటివరకు రెండు ఫేజ్‌ల ట్రయల్స్‌ ముగియగా.. మూడో ఫేజ్‌ కోసం ICMR సిద్ధమవుతోంది. దీనికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా(DCGI) పర్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక RISUG కింద పురుషులకు 60 mg రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్‌తో ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా 99.02 శాతం పని చేసిందని అధ్యయనం పేర్కొంది. అంటే RISUGతో 99 శాతం గర్భాలను నివారించవచ్చు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ఎలా పని చేస్తుంది?
డై-మిథైల్ సల్ఫాక్సైడ్ (DMSO) ద్వారా స్పెర్మ్ డక్ట్‌లోకి స్టైరీన్ మాలిక్ అన్‌హైడ్రైడ్ (SMA) అనే పాలీమెరిక్ ఏజెంట్‌ను ఇంజెక్ట్ చేస్తారు. స్పెర్మ్ సెల్స్ స్పెర్మాటిక్ డక్ట్ ద్వారా మాత్రమే వృషణాల నుంచి ప్రైవేట్ భాగాలకు చేరుతుంది. వృషణాల నుంచి ప్రైవేట్ భాగాలకు స్పెర్మ్‌ను తీసుకువెళ్ళే రెండు స్పెర్మ్ డక్ట్స్ (వాస్ డిఫెరెన్స్) లోకి రిసాగ్ ఇంజెక్ట్ చేస్తారు. వృషణాలను ఇంజెక్ట్ చేయాల్సిన చోట అనస్థీషియా ఇస్తారు. అప్పుడు పెయిన్‌ లేకుండా ఉంటుంది. అప్పుడు రిసాగ్ మొదటి, రెండో స్పెర్మ్ డక్ట్‌లోకి వరుసగా ఇంజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత పాలిమర్ స్పెర్మ్ డక్ట్ అక్కడి వాల్స్‌ను టచ్‌ అవుతుంది. పాలిమర్ స్పెర్మ్ ఆ సయయంలో స్పెర్స్‌ టెయిల్‌ను కట్ చేస్తుంది. టెయిల్ కట్ అయితే అప్పుడు గర్భం వచ్చే ఛాన్స్ ఉండదు. రిసాగ్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు (IIT Kharagpur) చెందిన డాక్టర్ సుజోయ్ కుమార్ గుహ (Sujoy Kumar Guha) అభివృద్ధి చేశారు. జైపూర్, న్యూఢిల్లీ, ఉధంపూర్, ఖరగ్‌పూర్, లూథియానాల్లో ఈ పరిశోధన జరిగింది. ఇక ఈ అధ్యయనంలో పురుషుల భార్యల ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించారు. వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేవని తేలింది. ఇటు ఈ ఇంజెక్షన్‌ వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్‌ తీసుకున్న కొంతమంది పురుషల్లో జ్వరం, వాపు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ లాంటి దుష్ప్రభావాలు కనిపించాయి. అయితేకొన్ని వారాల నుంచి వారంతా మూడు నెలలలోపు కోలుకున్నారు.

Also Read: ఇతరులు ఏం చేశారాన్నది కాదు.. మనం ఎలా రియాక్ట్ అయ్యామన్నది ముఖ్యం బిగిలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు