ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక(Srilanka),పాకిస్థాన్(Pakistan) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంకేయులు బ్యాటింగ్‌లో అదరగొట్టారు. పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. హసన్ అలీ, హారీశ్ రౌఫ్ మినహా మిగిలిప బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. వారిద్దరు సైతం పరుగులు సమర్పించుకున్నా కీలక వికెట్లు పడగొట్టారు. హసన్ అలీ నాలుగు వికెట్లతో రాణించగా.. రౌఫ్ 2 వికెట్లు తీశాడు. మిగిలిన వాళ్లు ఫెయిల్ అవ్వడంతో శ్రీలంక భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది శ్రీలంక.
ఇద్దరు సెంచరీలు:
ప్రస్తుత ప్రపంచ కప్ 2015 వరల్డ్‌కప్‌ని గుర్తుకు తెస్తోంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాటర్లు వీరవీహారం చేస్తున్నారు. న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇప్పుడు శ్రీలంక కూడా భారీ స్కోరు చేసింది. ఓపెనర్లుగా నిస్సంకా, పెరార దిగారు. నిస్సంకా 61 బంతుల్లో 51 రన్స్ చేయగా.. పెరార మాత్రం విఫలమయ్యాడు. హసన్ అలీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కుశాల మెండీస్, సదీరా క్రీజులోకి వచ్చారు. ఇద్దరూ బౌలర్లను బాది పడేశారు. వేగంగా రన్స్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పోటిపడి బౌండరీలు బాదారు. సింగిల్స్, టూస్ తీస్తూ ఫీల్డర్లను కూడా ముప్పుతిప్పలు పెట్టారు.
ముఖ్యంగా కుశాల మెండీస్ ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. 77 బంతుల్లో 122 రన్స్ చేశాడు మెండీస్. అంటే స్ట్రైక్ రేట్ 158. మెండీస్ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు ఉన్నాయి. 14 ఫోర్లు బాదాడు మెండీస్. చివరకు హసన్ అలీ బౌలింగ్‌లో ఇమామ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అటు సదీరా సైతం వేగంగా రన్స్ చేయడంతో శ్రీలంక 300 మార్క్‌ని ఈజీగా దాటేసింది. సదీరా కూడా సెంచరీ చేశాడు. 89 బాల్స్‌లో 108 రన్స్ చేశాడు సదీరా. అందులో రెండు సిక్సర్లు 11 ఫోర్లు ఉన్నాయి. సదీరా కూడా హసన్ అలీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 121 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేవాడు సదీరా. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో 400 పరుగులు చేస్తుందనుకున్న శ్రీలంక 350 పరుగుల లోపే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ALSO READ: ఒక్క బంతికి 13 పరుగులు .. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతం..!