Ind Vs Aus: ఆ తోపు లేకుండానే బరిలోకి టీమిండియా.. అయినా ఆస్ట్రేలియాకు బడితపూజే..!

ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుండగా యువ ఓపెనర్‌ గిల్‌ ఈ మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. డెంగీ బారిన పడ్డ గిల్‌ స్థానంలో ఇషాన్‌ కిషాన్‌ తుది జట్టులో ఆడనుండగా.. ముగ్గురు స్పిన్నర్లు(అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌)తో రోహిత్ సేన బరిలోకి దిగనుంది.

New Update
IND vs AUS: సమరానికి సై..భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా..నెగ్గేదెవరు..తగ్గేదెవరు..!!

రేపు(అక్టోబర్ 8) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs australia) మధ్య జరగనున్న ఫైట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌ కావడంతో ఇండియాలో క్రికెట్‌ ఫీవర్‌ ఓ రేంజ్‌కి వెళ్లే టైమ్‌ దగ్గర పడిందనే చెప్పాలి. రేపు చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. అందులోనూ రేపు ఆదివారం కావడంతో మధ్యాహ్నం బిర్యానీ తినేసీ టీవీలు ఆన్‌ చేసే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. ఇరు జట్లు బలాబలాల విషయంలో ఎవరికీ తక్కువ కానప్పటికీ ఇండియానే గెలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే వర్షం కారణంగా రెండు వార్మప్‌ మ్యాచ్‌లను కూడా టీమిండియా ఆడకపోవడం కాస్త ప్రతికూల అంశం.


గిల్‌ అవుట్.. ఇషాన్‌ ఇన్‌:
ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆడకముందే పెద్ద షాక్ తగిలింది. యువ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ డెంగీ బారిన పడడం గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇండియా గడ్డపై గిల్‌ ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో ఏకంగా సచిన్‌ రికార్డులకే ఎసరు పెట్టేలా కనిపించాడు. ఇంతలోనే ఏదో మాయదారి దోమ గిల్‌ని కుట్టేసింది. డెంగీని త్వరగా కోలుకోవడం కష్టమే.. ఎందుకంటే అది ప్లేట్‌లెట్లకు సంబంధించిన విషయం. ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో గిల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్‌తో కలిసి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయనున్నాడు. ఇక వన్‌డౌన్‌లో కోహ్లి.. టూ డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్, త్రీ డౌన్‌లో కేఎల్‌ రాహుల్‌, తర్వాత హార్ధిక్‌ పాండ్యాలతో బ్యాటింగ్‌ లైనప్‌ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పవు:
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అశ్విన్‌, కుల్దీప్‌, జడేజాతో ఆస్ట్రేలియాకు చెక్‌ పెట్టాలని రోహిత్ భావిస్తున్నాడు. చెన్నైకు స్పిన్‌ అనుకూలిస్తుందన్న విషయం తెలిసిందే. పైగా అశ్విన్‌కి ఇదే హోం గ్రౌండ్‌. ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్‌పై అశ్విన్‌కి మంచి రికార్డు ఉంది. అటు స్టివ్‌ స్మిత్‌పై జడేజాకు తిరుగులేని రికార్డు ఉంది. బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ని సిరాజ్‌ లేదా బుమ్రాతో కాకుండా అశ్విన్‌తోనే స్టార్ట్ చేయించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అశ్విన్‌ని ఆడడంలో వార్నర్‌ చాలా ఇబ్బంది పడతాడు. ఇక ఇటవలి జరిగిన బైలెటరల్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై ఇండియానే గెలిచింది. దీంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా బరిలోకి దూకుతోంది.

ప్లేయింగ్ ఎలెవన్ అంచనా:
ఇండియా: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్

ALSO READ: పాకిస్థాన్‌ క్రికెటర్లను పార్టీకి పిలిచిన కోహ్లీ.. సోషల్‌మీడియాలో రచ్చ..!

Advertisment
తాజా కథనాలు