ENG vs NZ: ఇంగ్లండ్‌ బౌలర్లను చీల్చిచెండాడిన కివీస్‌ బ్యాటర్లు.. ఫస్ట్ విక్టరీ న్యూజిలాండ్‌దే!

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఏకంగా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 36.2ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్‌ చేసింది. రచిన్‌ రవీంద్రతో పాటు డెవన్‌ కాన్వే సెంచరీలతో వీరవీహారం చేయడంతో కివీస్‌ ఈజీగా గెలిచేసింది.

New Update

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 50ఓవర్లలో 9 వికెట్ల నష్టాలను 282 పరుగులు చేసింది. ఓపెన్ మాలన్‌ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ బెయిర్‌స్టో 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అటు రూట్‌ అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడి టీమ్‌ని గాడిలో పడేశాడు. 86 బంతుల్లో 77 రన్స్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడాడు రూట్. ఇక హ్యారీ బ్రూక్‌ ఉన్నంత సేపు స్పీడ్‌గా బ్యాటింగ్‌ చేశాడు. 16 బాల్స్‌లో 25 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ ఉంది. ఇక మొయిన్ అలీ మాత్రం పూర్తిగి నిరాశపరిచాడు. ఇక ఇదే సమయంలో బ్యాటింగ్‌కు దిగిన బట్లర్‌ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 42 బంతుల్లో 43 రన్స్ చేసిన బట్లర్‌ హెన్రీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక చివరిలో అదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌ మరో వికట్ పడకుండా జాగ్రత పడడంతో ఇంగ్లండ్‌ 282 రన్స్ చేసింది.

ఎక్కడా ఛాన్స్‌ ఇవ్వలేదుగా:
టార్గెట్‌ ఛేజింగ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ మొదటి బంతికే డకౌట్ అయినా కాన్వేతో పాటు రచీన్ రవీంద్ర సెంచరీలతో దుమ్మురేపారు. కాన్వే 121 బంతుల్లో 152 రన్స్‌తో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఇందులో ఏకంగా 19 ఫోర్లు ఉన్నాయి. 3 సిక్సులు కూడా బాదాడు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రచీన్ రవీంద్ర 96 బాల్స్‌లో 123 పరుగులతో రెచ్చిపోయి ఆడాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం రచీన్ రవీంద్ర గురించే చర్చించుకుంటోంది. రచీన్‌ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఇంగ్లండ్‌ బౌలర్లలో శామ్‌ కర్రాన్‌ కేవలం ఒక్క వికెట్ తీశాడు.

ALSO READ: వరల్డ్ కప్ క్రేజ్, ఫ్యాన్స్ కోసం పిజ్జా ధరలను భారీగా తగ్గించిన డోమినోస్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు