ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్ యావత్ ప్రపంచం కంటిరెప్ప వాల్చకుండా చూస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? ఎవరు ట్రోఫీని కైవసం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, మ్యాచ్ విన్నర్‌కు ట్రోఫీ టైటిల్‌తో పాటు భారీ మొత్తంలో నగదు ప్రైజ్ లభించనుంది. రన్నరప్‌కు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది. ట్రోఫీ కోసం ఐసీసీ 10 మిలియన్ డాలర్స్ కేటాయించింది. ఈ మొత్తాన్ని విజేత, రన్నరప్‌కు కేటాయిస్తారు. 45 రోజుల పాటు జరిగిన క్రికెట్ ప్రపంచ ప్ 2023 నేటి మ్యా్చ్‌తో ముగియనుంది. భారత్-ఆస్ట్రేలియా టీమ్‌లు అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో రెండు జట్లు అద్భుత ప్రదర్శనను కనబరిచాయి. ఇప్పటి వరకు ఆడిన మొత్తం 10 మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో 8 గెలిచింది. ఇరు జట్లూ టైటిల్‌ను గెలుచుకునేందుకు ధీటుగా పోరాడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ద్వారా ట్రోఫీ విన్నర్, రన్నరప్‌కు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ కూడా ఇస్తుంది.
వన్డే ప్రపంచ కప్ 2023 ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. ట్రోఫీ విన్నర్‌కు 4 మిలియన్ల అమెరికన్ డాలర్స్ ప్రైజ్ మనీ ఇస్తారు. ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 33,31,67,000(రూ.33.31 కోట్లు). రన్నరప్‌కు 2 మిలియన్ల అమెరికన్ డాలర్స్ ఇస్తారు. ఇండియన్ కరెన్సీలో ఇది రూ. 16,65,83,500(రూ.16.65 కోట్లు) లభిస్తుంది. టోర్నమెంట్ మొత్తం 10 మిలియన్ల ప్రైజ్ మనీ ఏర్పాటు చేస్తుంది ఐసీసీ. అయితే, పైనల్‌కు చేరిన జట్లే కాకుండా.. గ్రూప్ స్టేజ్ గేమ్‌లలో గెలుపొందినందుకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ప్రతి విజయానికి జట్లకు 40,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తుంది. ఇక గ్రూప్ స్టేజ్ చివరిలో నాకౌట్‌లకు చేరుకోవడంలో విఫలమైన జట్లకు ఒక్కో టీమ్‌కు 100,000 అమెరికన్ డాలర్స్ ప్రైజ్ మనీ అందిస్తుంది ఐసిసి.
☛ ఐసీసీ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ: 10 మిలియన్ల డాలర్స్
☛ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ : 4,000,000 డాలర్లు(రూ.33.31 కోట్లు).
☛ రన్నర్స్-అప్ : 2,000,000 డాలర్లు(రూ.16.65 కోట్లు)
☛ ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు: 800,000 | 1,600,000 డాలర్లు.
☛ గ్రూప్ దశ తర్వాత టర్మినేట్ అయిన టీమ్‌లకు: 100,000 | 600,000
☛ ప్రతి గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన మ్యాచ్ విన్నర్స్‌కి: 40,000 | 1,800,000 డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తారు.
Also Read:
అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను..కూతురు పుట్టిన తరువాత జీవితమే: కేటీఆర్!
హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్