IBPS Clerk: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6128 ఉద్యోగాలు!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో 6128 క్లర్క్‌ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. జులై 1-21 వరకూ ఆన్ లైన్ వేదికగా అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

IBPS Clerk: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6128 ఉద్యోగాలు!
New Update

IBPS Clerk Notification 2024: నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) తీపి కబురు అందించింది. 2025-2026 సంవత్సరానికి గానూ కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (CRP)-XIV ద్వారా 6128 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. ఈ మేరకు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్టులు భ‌ర్తీ చేపట్టనుండగా తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఖాళీలున్నాయి.

పోస్టులు:

ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టులు : 6128

అర్హత‌:

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వ‌య‌సు:

దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకుల్లో ఈ ఖాళీలున్నాయి.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ విధానంలో 2024 జులై 1 నుంచి జులై 21 వరకూ అప్లై చేసుకోవాలి.

ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ నిర్వహణ తేదీలు:

ఆగస్టు 12 నుంచి 17 వరకు.

ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ పరీక్ష తేదీలు:

ఆగస్టు 24, 25, 31 తేదీల్లో నిర్వహిస్తారు

ప్రిలిమిన‌రీ పరీక్ష ఫలితాల విడుదల:

సెప్టెంబర్‌, 2024.

ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్ష తేదీ:

అక్టోబర్‌, 2024

IBPS Clerk Notification 2024 Notification PDF

Apply Online For IBPS Clerk 

Also Read: ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

#ibps #ibps-clerk-recruitment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe