Telangana Elections: కేసీఆర్‌పై పోటీకి సై.. ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్..

మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటా చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌తో పాటు సీఎం కేసిఆర్ పై గజ్వేల్ లో సైతం పోటీ చేసేందుకు రెడీ అంటూ ప్రకటించారు. ఈటల రాజేందర్.

New Update
Telangana Elections: కేసీఆర్‌పై పోటీకి సై.. ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్..

Etela Rajender Ready to Contest Against KCR:

మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటా చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌తో పాటు సీఎం కేసిఆర్ పై గజ్వేల్ లో సైతం పోటీ చేసేందుకు రెడీ అంటూ ప్రకటించారు. ఈటల రాజేందర్. గురువారం నాడు హుజూరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ప్రసంగించిన ఈటల.. కథానాయకులంతా మీరే అంటూ ప్రజలను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. ఈ నెల16వ తేదీన హుజూరాబాద్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని, ఆ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారని తెలిపారు.

గజ్వేల్ బరిలోనూ ఉంటా..

ఇదే సమయంలో ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే స్థానాలపై క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. తాను హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా.. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి కూడా అసెంబ్లీ బరిలో దిగుతానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా భరిగీసి కొట్లాడిన చరిత్ర తమదని, పులిబిడ్డ మాదిరిగా తిరగబడి తమ సత్తా చూపాలని కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు ఈటల రాజేందర్.

రెండు సంవత్సరాల నుంచి నరకం చూస్తున్నాం..

గత రెండు సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే విజయమని ఆయన అన్నారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. అవసరమైతే ఉన్నదంతా అమ్ముకొని మళ్ళీ కష్టపడి కూలి పనులైనా చేస్తామని గతంలో తన భార్య జమున చేసిన కామెంట్స్‌ని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ప్రజల ప్రేమను పొందితేనే రాజకీయ నాయకులకు ఆదరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Also Read:

స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇండియా,అఫ్ఘాన్‌ మ్యాచ్‌ సమయంలో ఏం జరిగిందంటే?

 శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు