Bigg Boss 7 Winner: నేను గెలిచిన 35 లక్షలు మొత్తం వాళ్ళకే .. పల్లవి ప్రశాంత్ షాకింగ్ కామెంట్స్..!

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. విజేతను ప్రకటించిన అనంతరం స్టేజ్ పై ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాను గెలుచుకున్న విన్నర్ అమౌంట్ 35 లక్షలు మొత్తం కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని తెలిపాడు.

New Update
Bigg Boss 7 Winner: నేను గెలిచిన 35 లక్షలు మొత్తం వాళ్ళకే .. పల్లవి ప్రశాంత్  షాకింగ్ కామెంట్స్..!

Bigg Boss 7 Winner: బిగ్ బాస్ సీజన్ 7 ఉత్కంఠగా ముగిసింది. చివరి వారం వరకు శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య జరిగిన టైటిల్ పోరులో రైతు బిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి బిగ్ బాస్ చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేశాడు. సీజన్ మొదట్లో.. రెండు వారాలకే వెళ్ళిపోతాడని ఊహించారు. కానీ ఆ తర్వాత తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆట పై తనకున్న పట్టుదల, ఆసక్తి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆదివారం ముగిసిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేతను ప్రకటించిన సంగతి తెలిసిందే. విజేతను ప్రకటించిన తర్వాత స్టేజ్ పై ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Also Read: Hanuman Official Trailer: తేజ సజ్జ ‘హనుమాన్’ ట్రైలర్.. ‘ధర్మం కోసం పోరాడే ప్రతీఒక్కరితో హనుమాన్ ఉంటాడు’

publive-image

బిగ్ బాస్ విజేతకు ప్రకటించిన ప్రైజ్ మనీ 50 లక్షలు. నాలుగవ స్థానంలో యావర్ తీసుకొని వచ్చిన 15 లక్షలు విన్నర్ అమౌంట్ నుంచి కోత పడ్డాయి. ఆ తర్వాత ప్రశాంత్ కు వచ్చిన విన్నర్ అమౌంట్ 35 లక్షలు. తన ప్రైజ్ మనీ ఏం చేస్తావు అని అడగగా ప్రశాంత్ చెప్పిన మాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నేను గెలుచుకున్న 35 లక్షలు మొత్తం కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఇస్తాను. మాట తప్పేదే లేదు.. మళ్ళి వచ్చినంటే తగ్గేదే లేదు అని చెప్పాడు. రైతుల కోసమే ఆడాను.. డబ్బు కూడా వాళ్ళకే ఇస్తాను అని తెలిపాడు. విన్నర్ అమౌంట్ తో పాటు అదనంగా 10 లక్షలు విలువ చేసే కారు, 15 లక్షల విలువ గల డైమండ్ నక్లెస్ ప్రశాంత్ కు లభించాయి. కారు నాన్నకు ఇస్తాను.. నక్లెస్ అమ్మకు ఇస్తాను.. నా ఫ్రీజ్ మనీ అంతా రైతుల కోసమే అని చెప్పాడు. ఒక రైతు బిడ్డగా కష్టాల్లో ఉన్న రైతులకు సహాయం చేయాలనే ప్రశాంత్ ఆలోచనను అందరు ప్రశంసిస్తున్నారు.

Also Read: Bigg Boss 7 Telugu: గీతూ కారు పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి..!

Advertisment
తాజా కథనాలు