Hypertension Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది మధుమేహం, రక్త పోటు, ఊబకాయం, గుండె సంబంధిత వంటి జీవన శైలి వ్యాధులతో బాధపడుతున్నారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు వీటి పై ఎక్కువగా ప్రభావం చూపును. జీవన శైలి సమస్యలు ఉన్న వారు.. వారి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా అధిక రక్త పోటు సమస్యతో బాధపడేవాళ్లు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే శరీరంలో రక్తపోటును తగ్గించడానికి సహాయపడును. అధిక రక్త పోటు కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
వ్యాయామం చేయాలి
వారంలో మూడు రోజులు 30 నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే .. రక్త పోటును తగ్గించడంలో మంచి ప్రభావాన్ని చూపును. శారీరక శ్రమ, వ్యాయామాలు చేయడం రక్త పోటును తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడం
నివేదికల ప్రకారం 42% మందిలో బరువు తగ్గాక అధిక రక్త పోటు సమస్య తగ్గినట్లు చెబుతున్నాయి. అధిక రక్త పోటు సమస్యతో బాధపడే వాళ్ళు బరువు తగ్గడం సరైన ఛాయిస్.
Also Read: Health Tips: ఈ కూరగాయలు పచ్చిగా తింటే.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం జాగ్రత్త..!
మద్యపానం తగ్గించడం
మధ్య పానం రక్తపోటు పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో రక్త పోటు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రక్త పోటు సమస్య ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం తగ్గిస్తే రక్తపోటును తగ్గించడంలో సహాయపడును.
ఉప్పు తక్కువగా తినండి
రక్త పోటు సమస్య ఉన్న వాళ్ళు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. సోడియం ఎక్కువగా తీసుకుంటే అధిక రక్త పోటుకు కారణమవుతుంది. రోజు మనం తినే ఆహారంలో ఉప్పును తగ్గిస్తే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడును.
Also Read: Interior Ideas: మీ ఇల్లు రిచ్ గా కనిపించాలంటే.. ఈ ప్లాంట్స్ తప్పక పెట్టండి..!