/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/M-jpg.webp)
London: కూతురి పెళ్లిని ఘనంగా జరిపించేందుకు స్వదేశానికి వస్తున్న రైసుద్దీన్ అనే వ్యక్తిని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన లండన్ లో చోటుచేసుకుంది. రైసుద్దీన్ హైదరాబాద్ కు ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురుచూస్తున్న పెళ్లింట ఈ ఘటనతో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యలు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రైసుద్దీన్ మృతదేహన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
హైదరాబాద్ కు చెందిన ఖాజా రయీసుద్దీన్ 2011లో ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అప్పటి నుంచి వెస్ట్ యార్క్ షైర్ లోని లీడ్స్ లో నివసిస్తున్నాడు. ఇటీవల రైసుద్దీన్ కూతురి పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 5న హైదరాబాద్ లో కూతురు వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఇండియాకు తిరిగి వచ్చేందుకు రయీసుద్దీన్ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు. కూతురు పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చేందుకు స్నేహితుడితో కలిసి లండన్ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో దుండగులు రైసుద్దీన్‌పై దాడికి పాల్పడ్డారని సమాచారం.
కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో స్నేహితులిద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం అతని వద్ద ఉన్న బంగారం, డబ్బు, విలువైన వస్తువులను దోచుకుని దుండగుడు పరార్ అయ్యారు. తీవ్ర రక్తస్రావం కారణంగా రయీసుద్దీన్ తో పాటు అతడి స్నేహితుడు కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, రయీసుద్దీన్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ కు చేర్చేలా చూడాలని బాధిత కుటుంబం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.