ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..నిందితుడికి బెయిల్‌..!!

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రవళిక హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివరాం రాథోడ్‌ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో సరైన సాక్షాధారాలు లేనందున శివరాంకు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తి గత పూచికత్తు తో వదిలేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..నిందితుడికి బెయిల్‌..!!
New Update

Pravalika Boy Friend Gets Bail: టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ కు బెయిల్ వచ్చింది.  నిందితుడు శివరాం రాథోడ్ ని నాంపల్లి కోర్టు లో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు శివరాం రాథోడ్ రిమాండ్ కు అనుమతించింది. కానీ ప్రవళిక ఆత్మహత్య కేసులో సరైన సాక్షాధాలు లేనందున నాంపల్లి కోర్టు నిందితుడు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తి గత పూచికత్తుతో శివరాంను విడిచి పెట్టాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.

హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని హస్టల్‌లో ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గ్రూప్ పరీక్షలు వాయిదా పడటంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని తేల్చి చెప్పారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి శివరాం రాథోడ్ పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.ఈ నేపథ్యంలో శివరాం రాథోడ్ కోర్టులో లొంగిపోయాడు. తాను లొంగిపోతున్నానంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్‌ దాఖలు చేశాడు. నాంపల్లి 9 మెట్రోపాలియన్ న్యాయమూర్తి ఎదుట అతడు లొంగిపోయాడు.

Also Read: 55 మందితో BJP ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!!

ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. గ్రూప్‌-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు కేసీఆర్ సర్కారే కారణం అంటూ విమర్శలు చేశారు. ఇక పోలీసుల దర్యాప్తులో ప్రేమ వ్యవహారం అని తేలడంతో.. పోలీసులు శివరా రాథోడ్‌ కోసం పలు రాష్ట్రాల్లో వెతికారు. చివరికి పూణెలో అతడ్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో శివరాం రాథోడ్ కోర్టులో లొంగిపోయాడు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ప్రవళిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. నిరుద్యోగులు మాత్రం ప్రవళిక గ్రూప్ పరీక్షలకు దరఖాస్తు చేసిందని.. పరీక్ష వాయిదా పడటంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బీఆర్ఎస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#hyderabad #pravalika-boy-friend
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe