Niloufer Hospital: హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం!

హైదరాబాద్‌ నిలోఫర్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. తల్లిదండ్రులు, చిన్నపిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రి మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది.

Niloufer Hospital: హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం!
New Update

Fire Accident at Niloufer Hospital Hyderabad: హైదరాబాద్‌ నిలోఫర్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. తల్లిదండ్రులు, చిన్నపిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రి మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది.

నీలోఫర్ చరిత్ర:

నీలోఫర్ హాస్పిటల్ (Niloufer Hospital) హైదరాబాద్‌ నగరం మధ్యలో ఉన్న ఆస్పత్రి. యువరాణి నీలోఫర్ 1949లో నీలోఫర్ అనే సంస్థను స్థాపించారు ఒట్టోమన్ సామ్రాజ్యం (టర్కీ) రాజు కుమార్తెన నీలోఫర్‌ను 1931లో హైదరాబాద్‌ రాజ్య 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు (చివరి అసఫ్ జాహి పాలకుడు) ప్రిన్స్ మొజాంజాహి వివాహం చేసుకున్నాడు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మాదిరిగానే, నీలోఫర్ కు కూడా పేదలకు సేవ చేయటానికి ఇష్టం ఉండడంతో, నర్సుగా సేవ చేసింది. 1949 సంవత్సరంలో ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో యువరాణి నీలోఫర్ పనిమనిషి మరణించింది. ఆ విషయం తెలుసుకున్న యువరాణి, ఇకమీదట ఏ తల్లి మరణించకుండా చూసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల తలెత్తే సమస్యల గురించి నీలోఫర్, తన మామ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు తెలియజేసింది.

ఆ రోజుల్లో ప్రసవాలు ఎక్కువగా ఇంట్లో జరిగేవి, దాంతో సాధారణ సమస్యలు రావడంతోపాటు తల్లి లేదా బిడ్డకు ప్రాణాంతకం ఉంటుంది. హైదరాబాద్‌ నగరంలోని రెడ్ హిల్స్‌ ప్రాంతంలో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నీలౌఫర్ హాస్పిటల్ ముఖ్యంగా ప్రసూతి విభాగం క్లిష్టమైన వైద్య సేవల కోసం ఉద్దేశించబడింది. 1953 లో తల్లి, బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి 100 పడకల ఆసుపత్రిగా ప్రారంభించబడింది. అధునాతన ప్రసూతి, శిశువైద్య శస్త్రచికిత్సలతో రోగనిర్ధారణ సదుపాయాలతో 500 పడకలకు పెంచింది.

Also Read: నేనే మొదట ప్రపోజ్‌ చేశా.. వరుణ్ - లావణ్య ప్రేమ కథలు! 

#niloufer-hospital #hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe