Hyderabad: నా భర్తను అందుకే చంపేశారు.. బిల్డర్ మధు భార్య షాకింగ్ కామెంట్స్..! బిల్డర్ మధు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. డబ్బులు, బంగారం కోసమే తన భర్తను హత్య చేశారంటోంది మధు భార్య. రేణుకాప్రసాద్‌తో తమకు పరిచయం లేదని.. తమ పిల్లలపై నిందలు వేయడం సరికాదని వాపోయింది. తమకు పోలీసులు భద్రత కల్పించాలని మధు భార్య వేడుకుంటుంది. By Jyoshna Sappogula 28 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad Builder Madhu Case: హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్తను డబ్బులు, బంగారం కోసమే హత్య చేశారని మధు భార్య కామెంట్స్ చేసింది. డ్రైవర్ రేణుకాప్రసాద్‌తో తమకు పరిచయం లేదని.. తమ ఇంటికి ఎప్పుడూ రాలేదని తెలిపింది. తమ పిల్లలపై నిందలు వేయడం సరికాదని వాపోయింది. Also read: మా పిల్లలను మాకిచ్చేయండి సారూ.. రాచకొండ పోలీసు కార్యాలయం వద్ద తల్లుల ఆర్తనాదాలు! డబ్బుల కోసమే బీదర్ వెళ్తున్నట్లు చెప్పారని.. మధు ఫోన్ స్విచ్ఛాప్ వస్తే..రేణుకా ప్రసాద్‌కు ఫోన్ చేశామని..ఇందులో ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని మధు భార్య వ్యాఖ్యానించింది. తమ అమ్మాయికి పెళ్లి కుదిరిందని వెల్లడించింది. ఈ క్రమంలోనే పోలీసులు తమకు భద్రత కల్పించాలని ఆమె కోరింది. Also Read: సల్మాన్ కు విలన్ గా కట్టప్ప.. వైరలవుతున్న ‘సికందర్’ అప్డేట్ కాగా, బిల్డర్ మధు శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని వద్ద ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటిపై ఉన్న రూ.20 లక్షల విలువైన బంగారం మాయమయ్యాయి. అతని డ్రైవర్ రేణుక దొరికితే ఈ కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. #builder-madhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి